Search
Wednesday 22 November 2017
  • :
  • :

ప్రభుత్వ బ్యాంకులకిచ్చే మూలధనంతోనే ఎంఎస్‌ఎంఇ పరపతి మెరుగు

arun-jaityle

గురుగావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్‌బి)కు ఇచ్చే మరింత మూలధనం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఇ)ల పరపతిని పెంచుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దాంతో  ప్రైవేట్ పెట్టుబడి వృద్ధి పెరుగుతుందని, ఉద్యోగకల్పన పెరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల తొలి మంథన్ సమావేశంలో ఆయన టాప్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. నిరర్ధక ఆస్తులతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులు బలపరిచే రూపకల్పన కింద రెండేళ్ల కిం దటే ప్రభుత్వం రూ. 2.11 లక్షల కోట్ల మూలధనాన్ని కేటాయించింది. అందులో రీక్యాపిటలైజేషన్ బాండ్స్, బడ్జెటరీ మద్దతు, ఈక్విటీ డైల్యూషన్ కూడా ఉన్నాయి. ‘వృద్ధికి సం బంధించినంత వరకు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. కానీ ప్రైవేట్ పెట్టుబడే వెనుకబడింది’ అన్నారు. ‘ఒకవేళ మీరు ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సంగతి, విదేశీ పెట్టుబడి పెద్ద ఎత్తున వస్తున్న సంగతి అర్థమవుతుంది’ అని చెప్పారు. ‘పూర్తిస్థాయిలో వృద్ధి రేటు సాధించాలంటే ప్రైవేట్ పెట్టుబడి కూడా ఊపందుకో వాల్సి ఉంటుంది’ అని జైట్లీ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మద్దతు ఇవ్వాలని బ్యాంకు రంగం లో దృష్టి పెట్టామన్నారు. ఎందుకంటే ఈ ఎంఎస్‌ఎంఇ రంగమే ఉద్యోగాలు సృష్టిస్తోందని, ఆర్థిక వృద్ధికి ఊతం అవుతుందని చెప్పారు. అయితే ఎంఎస్‌ఎంఇకి అంతర్జాతీయ ఫైనాన్స్ లేక బాండ్ మార్కెట్ అందుబాటులో లేదు అన్నారు. బాండ్స్ ద్వారా మరింత మూలధనాన్ని పెంచాలని, బ్యాంకుల ఈక్విటీ విస్తరణ చేపట్టాలని  ప్రభుత్వం నిర్ణయించిందని జైట్లీ చెప్పారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా చూస్తామన్నారు. బ్యాంకు అధికారులను ఉద్దే శించి‘మీ లావాదేవీల్లో మా జోక్యం చూడ బోరు. కానీ బ్యాంకింగ్‌వ్యవస్థలో మార్పులు సంభవిస్తున్న ప్పుడు, డబ్బు పెట్టుబడి పెరుగుతున్నప్పుడు, బ్యాంకింగ్ వ్యవస్థ బలో పేతం కావడానికి మద్దతు ఇస్తున్నప్పుడు, మీరు వృద్ది పెరి గేందుకు మీ సామర్థాన్ని వినియోగించాల్సి ఉం టుంది’ అన్నారు.ప్రభుత్వ రంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తు లు 2015 మార్చిలో రూ. 2.78 లక్షల కోట్లు ఉండగా 2017 జూన్ నాటికి రూ. 7.33 లక్షల కోట్లకు పెరిగింది. గత మూడు న్నర ఏళ్లలో ప్రభుత్వం రూ. 51,000 కోట్లకు పైగా మూల ధనాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించింది.

Comments

comments