Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం

mimni2

గర్భిణీల కోసం 102 వాహనాలు
కార్పోరేట్ స్థాయిలో డయాలసిస్ యంత్రాల ఏర్పాటు
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. లకా్ష్మరెడ్డి

వికారాబాద్ జిల్లా : గర్భిణీల కోసం 102 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోనివిధంగా నేడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కెసిఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళల ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. కెసిఆర్ కిట్ పథకం వలన గర్భిణీలకు అవసరమైన వైద్య సేవలను వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్నారని, వారికి అవసరమైన పోషకాహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ కిట్ పథకం కింద ప్రసవాలు చేసిన వైద్య సిబ్బందికి కూడా ఇన్‌సెన్టీవ్‌లను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్క ప్రసవానికి 2 వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వేల రూపాయలలో ప్రసవం చేసిన డాక్టర్‌కు 500 రూపాయలు, వైద్య సిబ్బందికి 500 రూపాయలు, ఆసుపత్రి అవసరాల కోసం 1000 రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో బంగారు తెలంగాణ సాధించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టిందని చెప్పారు. రోగాల బారిన పడి ఇబ్బంది పడకముందే తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత గురించి తమ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పెయిన్ కిల్లర్ ట్లాబెట్లు వాడడం వలన కూడా కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని అడుగుతున్నారని, కాని మెడికల్ కాలేజ్ అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో డిఎన్‌వి కోర్సులను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. దీంతో మెడికల్ కాలేజ్ వలన కలిగే ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 మార్చురీ వాహనాల ద్వారా దురదృష్టవశాత్తు మృతి చెందిన 15,000 మందిని వారి ఇంటికి ఉచితంగా తరలించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ దివ్య వినతి మేరకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా త్వరలో మార్చురీ వాహనాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర

Comments

comments