Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

play*అనుకూలమైన అవకాశం కోసం ఎదురుచూడొద్దు – వచ్చిన అవకాశంలోనే సత్తాచాటాలి
*పట్టుదల ఉంటే రాష్ట్ర స్థాయి అవార్డు సాధించడం సులభతరమే
*జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ భారతిహోళికేరి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : సరైన అవకాశాలు లేక ముందుకు సాగలేమని చాలా మంది నిరాశ చెందుతుంటారు కానీ అవకాశం దొరికినప్పుటే తమ శక్తిసామర్థాలను నిరూపించుకొని ముందుకు దూసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి అన్నారు. గురువారం నాడు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి వికలాంగుల క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎంతటి వజ్రాన్నైనా సానబెడతారని, అలాంటిది మనకు గుర్తింపు రావాలంటే ఎదురుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ శక్తిసామర్థాలను నిరుపించుకోవాలని ఆమె సూచించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది వికలాంగులు క్రీడలకు హాజరయ్యారన్నారు. గత ఏడాది క్రీడల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కిందని, ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయి అవార్డు వస్తుందని ఆకాంక్షిస్తూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చక్కగా పాల్గొని జిల్లా, రాష్ట్ర సాయిలో రాణించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌జివోల సహాయంతో అవసరం ఉన్నచోట క్యాంపులను నిర్వహిస్తూ, డిసెంబర్ 3 నాటికి క్యాంపులను పూర్తి చేయాలని డిడబ్లువోను ఆదేశించారు. సదరం క్యాంపు ప్రతి నెలా నిర్వహించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వికలాంగులు కలెక్టర్‌ను కోరుతూ ప్రతినెలా నిర్వహించే క్యాంపును సజావుగా కొనసాగించాలని వికలాంగులు కలెక్టర్‌ను వేడుకున్నారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ.. గతంలో క్యాంపుకు వచ్చి రిజెక్ట్ అయినవారు తిరిగి వస్తున్నారని, అందువల్ల రెండు, మూడు నెలలకోసారి సదరం క్యాంపు నిర్వహిస్తామన్నారు. సదరం క్యాంపునకు వైద్యులు సంగారెడ్డి జిల్లా నుండి రావాల్సి ఉంటుందని, వికలాంగులు తమకు ఉన్న సమస్యలను జిల్లా అధికారికి తెలియజేయాలన్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ వికలాంగులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, వికలాంగుల శాఖాధికారిణి జ్యోతిపద్మ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా యువజన, క్రీడల అధికారి (ఇన్‌చార్జి) రమేష్‌బాబుతో పాటు పిఇటిలు మధు, శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ మాధవరెడ్డిలతో పాటు పాల్గొన్నారు.

Comments

comments