Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్ బాధ్యత ఎంపిడిఓలదే

charkram

మనతెలంగాణ/నిజామాబాద్‌బ్యూరో
జిల్లాలో ఎస్సీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహయ పథ కం ద్వారా వివిధ పథకాల మంజూరైన లబ్ద్ధిదారులకు సత్వరమే గ్రౌండింగ్ చేయాలని ఇన్‌ఛార్జీ జిల్లా కలెక్టర్ ఎ. రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఆయా సంక్షేమ పథకాలు, ఎంపిడిఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పథకాల అమలుకు సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మైనార్టీ, బిసి ద్వారా గత సంవత్సరం మంజూరైన పథకాలు పూర్తిగా గ్రౌండింగ్ అయినందున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1020 మంది లబ్దిదారులకు గ్రౌండింగ్ లక్షం కాగా అం దులో 890 మందికి గ్రౌండింగ్ పూర్తి చేయగా ఇక 130 మంది లబ్దిదారులకు గ్రౌండింగ్ చేయాల్సి ఉందన్నారు. ఈ పథకంలో సబ్సిడీ శాతం ప్రభుత్వమే ఎక్కువగా ఇస్తున్నందున బ్యాంకర్లతో మాట్లాడి పెండింగ్ గ్రౌండింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపిడిఓలను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్ బాధ్యత ఎంపిడిఓలదే అయినందున మండలానికి నిర్దేశించిన లక్షం మేరకు నిర్ణిత కాలవ్యవధిలో గ్రౌండింగ్ పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల అధిక శాతం వెచ్చిస్తున్నందున లబ్ధిదారునికి ప్రయోజనం కలిగే విధంగా చూ డాలన్నారు. బ్యాంకర్ల గ్రౌండింగ్ రుణ మం జూరులో జాప్యం చేసినట్లయితే తన దృష్టికి తేవాలన్నారు. అదే కాకుండా రుణ మంజూరిలో కావాల్సిన నిధులు, మంజూరిలో జా ప్యం జరిగినట్లయితే సంబంధిత హెడ్ ఆఫీస్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సకాలంలో నిధుల మంజూరుకు జిల్లా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అధికారులు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

Comments

comments