Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా వివాహ విందు

Nag

తారల తళుకుబెళుకుల మధ్య నాగచైతన్య, సమంతల వివాహ విందు వేడుక ఆద్యంతం హుషారుగా కొనసాగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి మధ్య హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి కన్నుల పండువగా ఈ వేడుక జరిగింది. కృష్ణ, విజయనిర్మల, హరికృష్ణ, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్ దంపతులు, రకుల్‌ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, మంచు లక్ష్మీ, జయసుధ, అల్లరి నరేష్, బ్రహ్మానందం, శ్రీవాసు, బోయపాటి శ్రీను, మారుతి, అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్, లగడపాటి శ్రీధర్, సుకుమార్, నానీ, కొరటాల శివ, బి.ఎ.రాజు తదితర సినీ ప్రముఖులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, లగడపాటి రాజగోపాల్‌రావు తదితరులు ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాగార్జున, అమలతో సహా అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఇక అక్టోబర్ 6, 7వ తేదీలలో నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని ఓ రిసార్ట్‌లో జరిగిన విషయం తెలిసిందే.

Comments

comments