Search
Wednesday 22 November 2017
  • :
  • :

బాలకృష్ణ, మహేశ్, ఎన్‌టిఆర్‌లకు నంది అవార్డులు

పురస్కారాలను  ప్రకటించిన ఎపి ప్రభుత్వం   

ఉత్తమ చిత్రాలుగా లెజెండ్, బాహుబలి, పెళ్లి చూపులు

Nandi

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిం చే నంది అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మంగళవారం నంది అవార్డులను ప్రకటించింది. అలా గే నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు, ఎన్‌టిఆర్ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలలో 2014 కుగాను ఉత్తమ చిత్రంగా ‘లెజెండ్’ సినిమా ఎంపికవ్వగా… ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ (లెజెండ్) అవార్డును గెలుచుకున్నా రు. ఇక 2015కుగాను ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వగా… ఉత్తమ నటుడిగా మహేష్‌బాబును (శ్రీమంతుడు) అవార్డు వరించింది. ఇక 2016లో ఉత్తమ చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపికవ్వగా… ఉత్తమ నటుడిగా ఎన్‌టిఆర్ (నాన్నకు ప్రేమతో) అవార్డుకు ఎంపికయ్యారు. ఇక జ్యూరీ కమిటీ ప్రతినిధులైన బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు, జీవిత తదితరులు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు.
2014 విజేతలు
ఉత్తమ చిత్రం : లెజెండ్
ఉత్తమ నటుడు : నందమూరి బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ నటి : అంజలి (గీతాంజలి)
బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు : రాజమౌళి
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు : ఆర్.నారాయణ మూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు : యువి కృష్ణంరాజు
ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు : కమల్‌హాసన్
ఉత్తమ సినీ విమర్శకులు పులగం చిన్నారాయణ
2015 విజేతలు
ఉత్తమ చిత్రం : బాహుబలి ది బిగినింగ్
ఉత్తమ నటుడు : మహేశ్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి : అనుష్క (సైజ్ జీరో)
బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు : ఎంఎం కీరవాణి
రఘుపతి వెంకయ్య అవార్డు : ఈశ్వర్
ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు : కె.రాఘవేంద్రరావు
2016 విజేతలు: చిత్రం : పెళ్లి చూపులు
ఉత్తమ నటుడు : ఎన్‌టిఆర్ (నాన్నకు ప్రేమతో)
బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు : బోయపాటి శ్రీనివాస్
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు : కె.ఎస్.రామారావు
రఘుపతి వెంకయ్య అవార్డు : చిరంజీవి
ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు : రజనీకాంత్
ఉత్తమ చిన్నారాయణ

Comments

comments