Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

వేధించే మెడనొప్పి…చికిత్స

neck

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కన్పించే సర్తెకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తము లేకుండా ఇటీవల యుక్తవయసులో ఉన్నవారు సైతం ఎదుర్కుంటున్నారు.దీనికి గల కారణం మారుతున్న జీవన శైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. మెడ వెనుక బాగంలో తలనుండి మొదలయ్యే మొదటి 7 వెన్నువూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి అస్టియోఫైట్స్ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన తీవ్రమైన మెడనొప్పితో వేధించబడుతారు. ఇలాంటి సమస్యనే సర్తెకల్ స్పాండిలోసిస్ అంటారు.
మెడ నొప్పికి కారణాలు :
ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటం వలన వస్తుంది. స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ద భంగిమలలో కూర్చోవడం.
కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం. ఒకే చోట గంటల తరబడి కదలకుండ పని చేయడం. నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్ లోపించటం.
లక్షణాలు :
మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదల్చినా నొప్పి తీవ్రత పెరుగును.
నాడులు ఒత్తిడికి గురి కావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపించును.
తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తల తిప్పినట్లుగా అన్పించుట, చెయ్యిపైకి ఎత్తడం కష్టంగా మారును. నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు తూలుతున్నట్లుగా అనిపించటం జరుగుతుంది.
జాగ్రత్తలు :
సర్తెకల్ స్పాండిలోసిన్‌తో వేధించ బడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనము నడిపేటప్పుడు, కుర్చీలొ కుర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్టు తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగాని, నేలమీదగాని పడుకోవాలి. తల క్రింద ఎతైన దిండ్లు వాడకూడదు. మెడను ఒకే సారి అకస్మాత్తుగా తిప్ప కూడదు. మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి. మెడనొప్పి రాకుండా ఉండటానికి పౌష్టిక ఆహరాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామము, యోగా చేయాలి.
చికిత్స :
హోమియోవైధ్యంలో సర్తెకల్ స్పాండిలోసిస్‌కు మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన మెడనొప్పి నుండి విముక్తి పొందవచ్చును.
మందులు :
బ్రయోనియా :మెడ కదిలించుట వలన నొప్పి అధికమగును, విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్దకంతో బాధపడుతుంటారు, దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ వీరిని కదిలించ కూడదు. కదలికల వలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించ దగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
హైపరికం: నొప్పి మెడ, భుజకండరాలలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. కదలికలు కష్టంగా మారును.
స్పైజీలియా : నొప్పి మెడ నుండి మొదలై ఎడుమ భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు ప్రయోజనకారి.
కాల్మియా : నొప్పి మెడ నుండి మొదలై కుడి భుజములో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
కోనియం : మెడ నొప్పితో పాటు కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది. మెడ అటు ఇటు త్రిప్పినప్పుడు వస్తువులు గుండ్రముగా తిరుగుతున్నట్లుగా అనిపించును.వృద్ధ్దులలో వచ్చే మెడ నొప్పికి ఈ మందు తప్పక వాడదగినది. ఈ మందులే కాకుండా కాక్యులస్, రస్‌టాక్స్, ఆర్నికా, రూటా, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, కాలికార్బ్, వంటి మందులను లక్షణసముదాయమును పరిగణలోకి తీసుకొని వైద్యం చేసినయెడల ‘సర్తెకల్ స్పాండిలోసిస్’ (మెడ నెప్పి)నుండి విముక్తి పొందవచ్చును

Comments

comments