Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

చైనాకు నేపాల్ షాక్..

nepal2
బీజింగ్: చైనాకు నేపాల్ షాకిచ్చింది. తమ దేశంలోని బుదీ గండకి ప్రాజెక్టు నిర్మాణానికి చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసింది. మాజీ ప్రధాని ప్రచండ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా కంపెనీ గెజువా గ్రూప్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.ఈ మేరకు దీనిపై నేపాల్ మంత్రి మండలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించి ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమాచారాన్ని నేపాల్ ఉప ప్రధాని కమల్‌థాపా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. మధ్యనేపాల్‌లో ప్రవహించే బుదీగండకి నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంతో పాటు పలు ఇతర పనులను చైనా కంపెనీకి కేటాయించారు. అయితే కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులు సక్రమంగా చేపట్టడం లేదని తేలడంతో కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు సమాచారం.

Comments

comments