Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఎత్తిపోతలకు కొత్త కళ

 

boreరీమాడలింగ్‌పై కసరత్తు
పునరావాస గ్రామాలకు సాగునీరు
ముథోల్ సెగ్మెంట్‌లో ఐదు పథకాలకు ప్రతిపాదనలు
యాక్షన్ ప్లాన్ అమలుకు మంత్రి ఐకేరెడ్డి ఆదేశం

నిర్మల్ జిల్లాలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. జిల్లాలో దాదా పు 40కి పైగా ఎత్తిపోతల పథకాలు ప్రస్తుతం సరైన ని ర్వహణ, మరమ్మతులకు నోచుకోక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. ఈ పథకాల ని ర్వహణపై ఐడీసీ అధికారులతో పాటు సంబంధిత ఆయకట్టు రై తాంగం నిర్లక్షంగా వ్యవహరిం చడంతో ఈ పథకాలు నిరుపయో గంగా మారాయి. ప్రభుత్వం కొ న్ని పథకాలు మినహా అన్ని పథ కాలు రైతులకు ఎలాంటి ప్రయో జనం చేకూర్చడం లేదు. కొద్ది రోజుల్లోనే ఎస్పా రెస్పీ పునరుద్దీవ ప థకం పూర్తి కాబో తుండడంతో రి జర్వాయర్లో నీటి కొరత ఉండబో దు. దీంతో ఎత్తి పోతల పథకాలకు పుష్కలంగా ప్రాజెక్టు నీరును అం దించే అవకాశం ఏర్పడనుంది. కా గా నిరుపయోగంగా ఉన్న ఎత్తి పోతల పథకాలపై మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి కేంద్రీక రించారు. ఈ ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సముందర్‌పల్లి, నర్సాపూర్(జి), కంజెర, టింబరేణి, దిలావర్‌పూర్, న్యూలోలం, బన్సపెల్లి ఎత్తిపోతల పథకాలను రీమాడలింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో నుంచి న్యూలోలం, బన్సపెల్లి, దిలావర్‌పూర్ పథకాలను సింగల్ స్టేజ్ పరిధిలోకి చేర్చనున్నారు. అలాగే కనకాపూర్, రత్నాపూర్‌కాండ్లి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. కాగా గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరిధిలో మారేగాం, కుప్టి, బోడాపూర్, సోనారి, మీర్జాపూర్ కొత్తగా ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రతిపాదించగా, ఉన్నత శాఖ అధికారులు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే కోటేగాం ముంపు గ్రామాలకు వెంటనే పునరావాసం కల్పించాలంటూ ఆదేశించారు. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్తగా కార్యాచరణను మొదలు పెట్టబోతుండడంతో ఎత్తిపోతల పథకాలన్ని సద్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటి కారణంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన పునరావాస గ్రామాలకు పుష్కలంగా సాగునీరు అందించే అవకాశం ఉందంటున్నారు. ఉత్సవ విగ్రహాలుగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ఎట్టకేలకు వినియోగంలోకి తీసుకొని వచ్చి నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల రైతాంగానికి సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించడంతో ఆయకట్టు రైతులకు సాగునీటికి ఢోకా లేకుండా పోతుందని అంటున్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ పనులను చేపట్టడంతో పాటు ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకొని రావాలనే సంకల్పంతో ముందుకెళ్లడంతో రైతులలో ఆశలు రేపుతుందని చెప్పవచ్చు.

Comments

comments