Search
Wednesday 22 November 2017
  • :
  • :

కొత్తగా 40 మున్సిపాలిటీలు

ktr2

15 వేల జనాభా మించిన మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మార్పు
35 కి.మీ.ల పరిధిలోని గ్రామాలు పట్టణాల్లో విలీనం వీడియో కాన్ఫరెన్స్‌లో కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో అదనంగా మరో 40 మున్సిపాలిటీలు ఏర్పడే అవకాశం ఉన్నదని మున్సిపల్ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15వేల జనాభా మించిన మేజర్ గ్రామ పంచాయతీలు పట్టణ పురపాలికలుగా మారుతాయని, ప్రస్తుత పురపాలక సంస్థల పరిధిని మరింత విస్తరించేందుకు వాటి చుట్టూ 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను పట్టణాల్లో విలీనం చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ సచివాలయం నుంచి మంగళవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై స్థానిక యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన “స్వచ్ఛ సర్వేక్షన్-2018” సిడిని విడుదల మంత్రి విడుదల చేశారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు, పరిపాలన సౌలభ్యం నిమిత్తం మున్సిపాలిటీలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, పరిపాలన సౌకర్యార్థం వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్ వంటిఅనేక మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని వినతులు అందుతున్నాయన్నారు. వివిధ పథకాల అమలు, అనుమతులు, పరిపాలనా పద్థతుల్లో పట్టణాల మధ్యలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలలో భిన్నత్వంతో ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలోనే నూతన మున్సిపాలిటీలు ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనంపై నిర్ణయం తీసుకోనున్నామని వివరించారు. దీనికి సంబంధించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
15వేల జనాభా గ్రామ పంచాయతీలను గుర్తించండి :
రాష్ట్రంలో 15వేల జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలను గుర్తించాలని మంత్రి కెటిఆర్ జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. ప్రస్తుతం పంచాయతీల కాల పరిమితిని వచ్చే ఏడాది జూలై నెలలో ముగుస్తున్న నేపథ్యం లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలను డినోటిఫై చేసి, చట్టబద్ధంగా వాటిని తిరిగి పురపాలక సంస్థలు నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రస్తు తం ఉన్న చట్టం ప్రకారం తీసుకోవల్సిన చర్యలను మం త్రి జిల్లా కలెక్టర్లకు వివరించారు. సాధ్యమైనంత ఎక్కు వ గ్రామ పంచాయతీల నుంచి నూతన మున్సిపాలిటీల ఏర్పాటు, వాటికి సంబంధించిన విలీన తీర్మానా లు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబందించి స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సహాయ సహకారాలను తీసుకోవాలన్నారు.
‘స్వచ్ఛ సర్వేక్షన్-2018’
ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలువాలె
“స్వచ్ఛ సర్వేక్షన్2018” ర్యాంకుల్లో ము న్సిపాలిటీలు అగ్రస్థానంలో నిలువాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అన్ని మున్సిపల్ కమి షనర్లు, ఛైర్మన్లతో ప్రత్యేకంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలన్నారు. గతంలో హై దరాబాద్, వరంగల్, సూర్యాపేట సంస్థలు మంచి స్థా నాలను సంపాదించాయని గుర్తు చేశారు. పారిశుధ్యం, హరితహారం, బహిరంగ మలమూత్ర వి సర్జన రహిత పట్టణాలుగా మార్చడం లాంటి కార్యక్రమాలు చేపట్టడంతో “స్వచ్ఛ సర్వేక్షన్-2018” ర్యాం కులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, పురపాలక శాఖ సంచాలకులు టికె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments