Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు

KODANDARAM

కరీంనగర్ : రాజకీయ పార్టీ ఏర్పాటుపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని టిజెఎసి కన్వీనర్ కోదండరాం తెలిపారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తమపై ఒత్తిడి వస్తున్న మాట నిజమేనని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జమ్మికుంటలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 30న హైదరాబాద్‌లో కొలువుల కొట్లాట సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సభకు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. పత్తికి మద్దతు ధర రూ.5,500 ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

No decision was made on the formation of the party

Comments

comments