Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ అవసరం లేదు!

 ఆర్‌బిఐ స్పష్టీకరణ
RBI

న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు ఆదివారం ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ లేక షరీయత్ బ్యాంకింగ్‌ను తీసుకురావాలన్న ఆలోచనేదిలేదని, వాటిని ఏర్పాటు చేయబోమని తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలైన ప్రశ్నకు ఈ మేరకు ఆర్‌బిఐ బదులిచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది. ఇస్లామిక్ బ్యాంకులపై ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం చర్చించినట్లు వివరించింది. ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది వడ్డీ రహిత బ్యాంకింగ్ విధానం. ఈ బ్యాంకింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని 2008లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై పరిశీలనలు జరపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐలోని అంతర్గత శాఖ గ్రూప్(ఐడిజి) ఇస్లామిక్ బ్యాంకింగ్‌లోని న్యాయబద్ధమైన, సాంకేతిక, నియంత్రణ సమస్యలను పరిశీలించింది. దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థికశాఖకు నివేదిక పంపింది. షరీయత్‌కు అనుకూలంగా ఉండే ‘ఇస్లామిక్ బ్యాంకింగ్ విండో’ను క్రమంగా బ్యాంకులో ప్రవేశపెట్టే విషయమై ఐడిజి 2016లో తన నివేదిక ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. అయితే ప్రసుత్తం అలాంటి ఆలోచనేదిలేదని తాజాగా భారత రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.
ఆర్‌టిఐ కింద ఆర్‌బిఐని ఏమడిగారు?
భారత్‌లో వడ్డీరాహిత్య బ్యాంకింగ్ లేదా ఇస్లామిక్ బ్యాంకింగ్‌కు ఎలాంటి చర్యలు చేపట్టారన్న వివరాలివ్వాల్సిందిగా సమాచార చట్టం కింద ప్రశ్నించారు. నరేంద్ర మోడీ 2014 ఆగస్ట్ 28న జన్‌ధన్ పథాకాన్ని ఆరంభించారు. ఈ పథకం పరిధిలోకి మొత్తం దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Comments

comments