Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాల అమలులో నెంబర్ వన్

lady

*డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
*భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరికలు

*ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న ప్రతి పక్షాలు

మన తెలంగాణ/పటాన్‌చెరు: సంక్షేమ పథకాల అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తదితర అం శాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలుస్తోందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. అన్నీ పార్టీలకు అధిష్టానం ఢిల్లీలో ఉన్న బాస్‌లు అయితే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలే అధిష్టానమన్నారు. ఆదివారం స్థానిక జిఎంఆర్ ఫంక్షన్ హాలు లో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు టిడిపి జిల్లా నాయకులు మెట్టు కుమార్ యాదవ్, పాశమైలారం సర్పం చ్ సుధాకర్‌గౌడ్, సింగిల్ విండలో చైర్మన్ పట్లోళ్ల రాఘవేందర్‌రెడ్డి తదితరులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంగారెడ్డికి బయలుదేరి వెళ్లారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కెసిఆర్ చేపడుతున్న ప్రజాకర్షక పథకాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలు లబ్ధిపొందడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధ్దాంతం చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తు న్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం 9గంటల పాటు నిర్విరామంగా విద్యుత్తును అందించకపోవడంతోపాటు, విద్యుత్తు చార్జీలు తగ్గించమన్నందుకు కాల్పులు జరిపి రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. తమ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గా ల వారికి లబ్ధ్ది చేకూర్చేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు సకాలంలో నిధులు అందచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. తాము చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి అన్ని పార్టీల నుండి పెద్ద ఎత్తు న నాయకులు వస్తున్నారన్నారు. ఎంఎల్‌సి, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఫరీదుద్దీన్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్త సైనికుని వలే పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి, వారికున్న సమస్యలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకురావాలని కోరారు. టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి చాగండ్ల నరేంద్రనాథ్ మాట్లాడుతూ గతంతో తాను పని చేసిన రెండు పార్టీలలో అహర్నిశలు కృషి చేసి పార్టీ పటిష్టతకు పాటు పడితే తనకు ఎటువంటి గుర్తింపునివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ తన మీద అపార నమ్మకంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, పార్టీ ప్రధాన కార్యదర్శి చాగండ్ల నరేంద్రనాథ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నరహరిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బక్కి వెంకటయ్య, సపాన్‌దేవ్‌లను ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన మెట్టు కుమార్‌యాదవ్ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే, ముఖ్య నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి భూపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పనాగేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ పొగాకు బసవేశ్వర్, జడ్పిటిసి రాములు గౌడ్, ఎంపిపిలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, కొలాన్ రవీందర్‌రెడ్డి, పార్టీ నాయకులు విజయ్‌కుమార్, అఫ్జల్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గ్గొన్నారు.
అట్టహాసంగా మెట్టు కుమార్ చేరిక : టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా మెట్టుకుమార్ యాదవ్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మెట్టు కుమార్ చేరికతో పట్టణంలో పార్టీకి బలమైన పునాదిపడినట్లయ్యింది.

Comments

comments