Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

దొంగల దాడిలో వృద్ధురాలు మృతి

Crime

రంగారెడ్డి: వృద్ధురాలిని దుండగులు దారుణంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం కొండకల్‌తండాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దోపిడీకి వచ్చిన కొందరు దొంగలు దాడికి పాల్పడ్డారు. దాంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, బంగారం కోసం వృద్ధురాలిపై దొంగలు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

old woman died in Thieves attack in Rangareddy.

Comments

comments