Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

man
మన తెలంగాణ/చిన్నగూడూరు ః ప్రమాధవశాత్తు భైకు చైన్ తెగి రోడ్డుపై పడి మృతి చెందిన సంఘటన గురువారం చిన్నగూడూరు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం గ్రామ శివారు అమేర్యాతండాకు చెందిన భానోత్ సురేష్(23) గురువారం ఉదయం తన ఇంటి నుండి భైకుపై చిన్నగూడూరు మీదుగా మానుకోట వెళ్తున్న క్రమంలో చిన్నగూడూరు మండల కేంద్రం శివారు కంఠమహేశ్వరప్వామి ఆలయం సమీపం వద్దా ప్రమాధవశాత్తు భైకు చైన్ తెగి రోడ్డుపై పడటంతో సురేష్‌కు తీవ్రగాయాలైనాయి. స్థానికులు సంఘటన స్థలంకు చేరుకుని ఆటోలో మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్తితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో సురేష్‌ని ఖమ్మం తీసుకుపోతున్న మార్గ మద్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

comments