Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

accident

దోమ: మంగళవారం రాత్రి  దోమ మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచడంతో పాటుగా మండలంలో విషాదఛాయలు నెలకొనేలా చేసింది. బుద్లాపూర్ గ్రామపంచాయతీ గోగ్యనాయక్ తండాకు చెందిన విఠల్ కూమారుడు నేనావత్ రాజు (23) తండ్రికి సహాయపడుతూ కుటుంబానికి అండగా నిలిచేవాడు. పండగ నేపథ్యంలో బంధువుల దగ్గరకు వెళ్ళిన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకవద్దామని ఇంటి నుంచి బయలుదేరిన అతను వెళ్ళేదారిలో పలుగుతాండ దగ్గరలో ప్రమాదవశాత్తు బైకుపై నుంచి పడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకుని విలపించారు.  రాజు కుటుంబంలో కుటుంబానికి అదరువుగా ఉన్న రాజుకు కొన్ని నెలల కిందటే వివాహం జరిగింది. భార్య ప్రస్తుతం 8నెలల గర్భవతి కావడంతో ఇలాంటి సంఘటన వారి కుటుంబంలో తీరనిశోకాన్ని నింపింది. తండాలో అందరితో కలుపుగోలుగా ఉండే అతనికి ఇలా జరగడంతో పండుగలు జరుగుతున్న తండా మూగబోయింది. అక్కడి పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరు తమ కన్నీరుమున్నీరుగా విలపించారు.  తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

Comments

comments