Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

పాక్ అదుపులో 55మంది భారత జాలర్లు

Indian-fishermen

కరాచీ: దాయాది పాకిస్తాన్ ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఆదివారం భారత్‌కు చెందిన 55 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. అలాగే జాలర్లకు సంబంధించిన తొమ్మిది పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తీర ప్రాంత గస్తీదళాలు తెలిపాయి. అయితే ప్రాథమిక విచారణ అనంతరం జాలర్లను పోలీసులకు అప్పగించనున్నట్లు వెల్లడించాయి. ప్రాదేశిక జలాలకు సంబంధించిన విభజన లేకపోవడంతో పాటు మత్స్యకారులు సాంకేతికతను ఉపయోగించకపోవడంతో ఇలా ఇరు దేశాలకు చెందిన జాలర్లు తరచూ భద్రతా సిబ్బందికి చిక్కడం జరుగుతుంది.

Pakistan Arrests 55 Indian Fishermen.

Comments

comments