Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పాలమూరు రోడ్ల దుస్థితిపై

talk

అసెంబ్లీలో గళమెత్తిన ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన అసెం బ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమ యంలో పాలమూరు రోడ్ల దుస్థితిపై మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్ గళమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి నలువైపులా ఉన్న రోడ్లు, పట్టణంలోని అంతర్గత రోడ్ల పరిస్థితి ఆధ్వాన్నంగా తయారైందని, ఎప్పటిలోగా రోడ్లకు మరమ్మతులు పూర్తి చేస్తారని ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిం చారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్, భూత్పూరు-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-రాయచూర్ మధ్య ఉన్న రోడ్ల పరిస్థితి దారుణంగా తయారై వాహనదారులు ప్రమా దాల బారినపడుతున్నారని,రోడ్లలన్నీ గుంతలమయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయని, రోడ్ల దుస్థితిపై అధికా రులకు ఫోన్లు చేసినా వారు స్పందించడం లేదని తెలిపారు. టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా రోడ్డును మాత్రం ఇంకా పూర్తి చేయలేద న్నారు. మహబూబ్‌నగర్-భూత్పూర్ మధ్య రోడ్డు పనులు ప్రారంభించి మూడు నుంచి నాలుగేళ్లవుతున్నా బ్రిడ్జిపనులు మాత్రం పూర్తి కాలేదని దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కోవడమేకాక తరచు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్-జడ్చర్ల రోడ్డు అధ్వాన్నంగా తయారుకావడంతో ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడని అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. మహబూబ్‌నగర్-జడ్చర్ల, మహబూబ్‌నగర్ రాయచూర్ రోడ్లను డబుల్‌లైన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు కాంట్రాక్టర్లుగా రాజకీ య పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారని వారు ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయరని, వేరేవ్వరిని పనులు చేయడానికి రానివ్వని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వారికి బ్లాక్‌లిస్టులో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. నిధులు తెచ్చిన పనులు చేయని
పరిస్థితిని తాము ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధితశాఖ మంత్రి చొరవ తీసుకుని త్వరగా రోడ్లకు మరమ్మత్తులను చేపట్టాలని, అదే విధంగా కొత్తగా చేపట్టనున్న రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పూర్తి చేయాలని కోరారు. వెనుకబడిన పాలమూరు జిల్లాపై మంత్రులు ఎక్కువగా శ్రద్ధ చూపాలని, అధిక నిధులను కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమాధానమిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలోని రోడ్లకు రూ.2466.70 లక్షలు బడ్జెట్‌లో కేటాయించడం జరిగిందని, వంతెనల నిర్మాణం కోసం రూ.89. 51 లక్షలు కేటాయించామని తెలిపారు. రోడ్డు పనుల నిమిత్తం 3 సార్లు టెండర్లు పిలవడం జరిగిందని, ఒక్కేఒక్క అధిక టెండర్ రావడంతో అధికా రులు ఆమోదించలేదని త్వరలోనే టెండర్లను పిలిచి పనులు చేపడతామని సమాధానమిచ్చారు. డబుల్‌లైన్ రోడ్లపై కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీకి విన్నవించడం జరిగిందని, కేంద్రమంత్రిత్వశాఖ నుంచి సాంకేతిక అనుమతి వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడతామని చెప్పారు. రోడ్ల పరిస్థి తిపై నివేదికలు తెప్పించుకుని వెంటనే రోడ్డు మరమ్మతులను చేపడతామని, కొత్తగా నిర్మించనున్న రోడ్లలను సంవత్సరం లోపు పూర్తిచేస్తామని తెలిపారు.

Comments

comments