Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఛీపాడు (నగర) పంచాయతీ..!

Panchathi-karyalam

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నగరంలోని మురికి కన్నా నగరపంచాయతీ పాలక మండలి వ్యవహార తీరు మరింత కంపుకొడుతున్నది. నగరపంచాయతీ ఏర్పడిన తర్వాత పన్నుల భారం పెరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయగా అదేంలేదు అభివృద్ధ్దితో పట్టణ ప్రజలను అందల మెక్కిస్తామంటూ ఊదర గొట్టారు. చివరకి ప్రజా సమస్యలు గాలిలో దీపంలా మారగా పన్నులు ,ఇతర భారం మాత్రం ప్రజల వెన్ను విరుస్తుంది.దీనికి తోడు అవినీతి కంపు కంపరం పుట్టిస్తున్నది.

మూడు ముక్కలాట: నాగర్‌కర్నూల్ నగర పంచాయతీ పాలక మండలి ఎన్నికలతో ప్రారంభమైన మూడు ముక్కల రాజకీయ క్రీడ, పదవీ కాలం గడిచే కొద్ది మరింత రంజుగా మారుతుంది. నగరపంచాయతీ వార్డు కౌన్సిలర్ల ఎన్నికల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారీటి కట్టబెట్టలేదు అధికార పక్షమైనటిఆర్‌ఎస్, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజేపిలు సమ ఉజ్జీవులుగా నిలిచాయి. చైర్మన్ రేసులో బేరసారాలు , ఎత్తులు పై ఎత్తు లతో ప్రారంభమైన రాజకీయ క్రీడ అంతకంతకూ ఊపందుకుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏకమైన కాంగ్రెస్, బిజెపిలు ఒక్కటై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని చైర్మన్‌గా బిజెపికౌన్సిలర్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్ను కున్నారు. కొంతకాలం అధికార పక్షం ఆటలు సాగకుండా అడ్డుకోవటంలో కాంగ్రెస్,బిజేపిలు విజయం సాధించాయి.ముఖ్యంగా నల్లవెల్లి రోడ్డు వెడల్పు విషయంలో అధికార పార్టీ ఏక పక్ష నిర్ణయం పాలక మండలిలోని మెజారిటి సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. పాక్షికంగా విజయం సాధించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ సభ్యులు నగరపంచాయతీలో అవినీతిఅంటూ ఆరోపణలకు తెరలేపారు. సమాచార హక్కు చట్టం ,లోకాయుక్తకు ఫిర్యాదు పరంపరలతో నగర పంచాయతీ , పాలకమండలిపై మరకపడింది.

అభివృద్ధ్ది పేరిట పార్టీ ఫిరాయింపు: అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నగర పంచాయతీ, కమిషనర్, చైర్మన్‌లపై ఆరోపణల దాడి ఉదృతమైంది.ఈక్రమంలోనే నాటి కమిషనర్ సస్పెన్షన్‌తో పరిస్థితి మరింత వేడె క్కింది.ఈ క్రమంలోనేనగరపంచాయతీ చైర్మన్ మోహన్ గౌడ్‌పట్టణ అభివృద్దికి నిధులుసరిగ్గా విడుదల కావడంలేదని,పనులు చేద్దామంటే అడుగడుగునా నిబంధనల పేరుతో అధికారులు సహకరించడంలేదన్న సాకు చూపిస్తూ అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.అతర్వాత అభివృద్ది మాటెలా ఛీ పాడు (నగర) పంచాయతీఉన్నా అవినీతి ఆరోప ణల పంరంపర పెరుగుతూనే వచ్చింది.నిదులుదారి మళ్లించారని తొలుత అధికారపార్టీ కౌన్సిలర్లుచేసిన ఫిర్యా దును విపక్ష కౌన్సి లర్లు అందిపుచ్చుకున్నారు. తొలుత అవినీతిఅన్న అధికార పార్టీ సభ్యులు పార్టీ మారగానే చైర్మన్‌కు అండగా వత్తాసు పలకడం ప్రారంభిం చారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు మాత్రం చైర్మన్‌పై తొలుత అధికార పక్షం ప్రారం భించిన ఆరోపణల దాడిని కొనసాగింపుకు తెరలేపారు.

నాడు అవినీతి అన్నవారు అక్కునచేర్చుకోగా తమవాడిగాచెప్పుకున్న విపక్షాలు ఎదురు దాడిని కొన సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరపంచాయతీ నిధులవి నియోగంపై లోకాయుక్తలో చేసిన ఫిర్యాదులతో మొదటి ఆర్థిక సంవత్సరం రికార్డులు సీజ్ అయ్యాయి. తొలి ఏడాది కోటికి పైగా ,ఆతర్వాత మరో కోటికి పైగా ఇలా రెండు కోట్ల కు పైగా నిధులు పక్కదారి పట్టాయని అవినీతి ఆరోప ణలతో నగరపంచాయతీ పరువు బజారుకెక్కింది. కౌన్సిలర్లుగా ఎన్నికయిన తాము ఎలాంటిఅభివృద్ది పనులుచేయలేక పోతున్నామని విపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కౌన్సిలర్లు అందరు మౌకికంగా ఏకాభిప్రా యంతో కొన్నిపనులు చేశారు. వాటి బిల్లులు కౌన్సిల్‌లో పెట్టి తీసుకుం దామని తొలుత అన్నిపక్షాలు అంగీకరించినా ఆతర్వాత పరిస్థితి భిన్నంగా మారింది. సాంకేతిక కారణాలతో బిల్లులు మంజూరికాక పోవ డంతో చేతి నుండి డబ్బు ఖర్చు చేసిపనులు చేయించినకౌన్సిలర్లలో అసహ నం మరింత గా పెరిగిపోయింది. అవినీతి ఆరోపణలపై చర్యతీసుకోవాలన్న వత్తిడి కూడా ఎక్కువైంది ఈ క్రమంలోనే ప్రతి కౌన్సిల్ సమావేశం ఓ రణ రంగంగా మారుతూ వస్తున్నది.

Comments

comments