Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కుమార్తె ప్రేమ పెళ్లి…

Parents-Attempt-Suicide

వరంగల్: జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే మనస్తాపంతో తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం… స్థానికంగా ఉండే దాసరి మల్లయ్య కూతురు దాసరి విజయ అదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. దాంతో తల్లిదండ్రులకు తెలియకుండా విజయ పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లయ్య దంపతులు మంగళవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మల్లయ్య దంపతులను చికిత్స కోసం నెక్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Parents Suicide Attempt due to their Daughter’s Love Marriage.

Comments

comments