Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

పరకాలకు అంతర్జాతీయ ఖ్యాతి

KADIYAM

ఎంఎల్‌ఎ చొరవ, ముఖ్యమంత్రి
అండతో నియోజకవర్గ అభివృద్ధి
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

మనతెలంగాణ/ఆత్మకూరు: టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఆసియాలోనే పరకాల నియోజకవర్గం పేరు మారుమోగుతుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవా రం ఆత్మకూరులో ఆత్మకూరు నుంచి కాశిబు గ్గ వరకు డబుల్‌రోడ్‌కు శంకుస్థాపన, మహి ళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, రోడ్ల భవనాలు, శిశు సంక్షేమశాఖ మంతి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంఎల్‌ఎ ధర్మారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చూపిస్తున్న చొరవతో ముఖ్యమంత్రి కెసిఆర్ అండతో పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఆయనన్నారు. మూడు నెలల్లో 12 వందల ఎకరాలు రైతుల నుంచి సేకరించడంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని ఆయనన్నారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూ.50కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పరకాల ప్రజల ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో నెరవేరిందన్నారు. టెక్స్‌టైల్ ఏర్పాటు లక్షా 25వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. రాష్ట్రంలో 296 రెసిడెన్షియల్ పాఠశాలలుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 544 రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నా రు. రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, వచ్చే సంవత్సరం వరంగల్ ప్రజలకు తాగు, సాగునీరు కాళేశ్వరం ద్వారా అందుతుందని రైతులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు ఎరువుల కొరత లేకుండా పనిచేస్తున్న, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలు రాబోయే కాలంలో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, జడ్పిటిసి సంజీవరెడ్డి, ఎఎంసి చైర్మన్ ధర్మరాజు, సర్పంచ్ నాగెల్లి సామ్యెల్, ఎంపిటిసిలు తేజాకుమారి, మహేశ్వరి, ఆర్‌డిఒ మహేందర్‌జీ, బండి రజనీకుమార్, కానుగంటి సంపత్‌కుమార్, ఎస్కతాళ్ల రవీందర్, జాకీర్ అలీ, మునుకుంట్ల సంపత్, ఎండి.అంకూస్, కాంతాల కేశవ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments