Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

భూమి కంపించడంతో పరుగులు తీసిన ప్రజలు

earth
భద్రాద్రి: ప్రజలు సాయంత్రం సమయంలో పనులు చేసుకుంటుండగా భూకంపించడం కలకలం రేపింది. ఈ భూకంపించడం జిల్లాలలోని రామవరంలో చోటుచేసుకుంది. సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించిన శబ్దం వినిపించడంతో ప్రజలు ఇళ్లు, దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. రామవరం కొన్నిచోట్ల సింగరేణి, కిన్నెరసాని నీటిసరఫరా పైపులైన్లు పగిలిపోయి నీరు బయటకు వస్తోంది. భూకంపించడం కారణంగానే పైపులైన్లు పగిలిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ సింగరేణి సంస్థ 2 ఇంక్లెన్ భూగర్భ గనని నడిపిందని స్థానికులు తెలిపారు. అది మూతపడిందని, దాని ప్రభావంతోనే భూకంపించడం ఏర్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Comments

comments