Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

ఉగ్ర, తీవ్రవాదాలపై ఉమ్మడి పోరు

Modi-at-ASEAN

ఆసియాన్ శిఖరాగ్ర సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మనీలా: ఉగ్రవాదంతో పోరాటానికి ఆసియాన్ దేశాల మధ్య పటిష్టమైన సహకారంతోపాటు గట్టి నియమాలతో కూడిన భద్రతా వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణవాద పోకడలను అ న్యాపదేశంగా మోడీ ప్రస్తావించారు. ఆ ప్రాంతం వనరుల సంపన్నమైనది కాబట్టి గట్టి నియమ పూరిత భద్రతా వ్యవస్థ అవసరమన్నారు. ఇక్కడ ఆసియాన్ ఇండియా శిఖరాగ్ర సభలో ఆయన ప్రసంగించారు. త మ ప్రాంతాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలో ఉగ్రవా దం, తీవ్రవాదం ముఖ్యమైనవని మోడీ చెప్పారు. ఆ రెండు సమస్యలతో వ్యక్తిగతంగా పోరాడడానికి ఎంతో శ్రమకోర్చామని, ఉమ్మడిగా ఆ కృషి సాగించాల్సిన త రుణం ఆసన్నమైందని ఆయన చెప్పారు. 10 దేశాల, ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) ఈ ప్రాంతంలో శక్తివంతమైన గ్రూపులలో ఒకటని గుర్తు చేశారు. దాని చర్చలలో చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ సహా అనేక దేశాలు పాలుపంచుకున్నట్లు వివరించారు. మోడీ తన ప్రసంగంలో దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఆ వివాదం ఈ శిఖరాగ్ర చర్చలపై నీలినీడలు ప్రసరించింది.

ఆసియాన్ గ్రూపు నియమబద్ధమైన భద్రతా వ్యవస్థ రూపకల్పనకు చేసే కృషికి భారత్ తప్పక సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకు డుగా సైనిక స్థావరాలు నిర్మించడం అంశంపై చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించారు. వియత్నాం, పిలిప్పీన్స్, బ్రూనీ సహా అనేక ఆసియాన్ సభ్యత్వ దేశాలు చైనా వాదనను ఖండిస్తూ తమ వాదనలు వినిపించాయి. భా రత దేశం ఆ సముద్రంలో స్వేచ్ఛా విహారాన్ని, వనరుల చేరికను సమర్థిస్తున్నట్లు మోడీ చెప్పారు. అంతర్జాతీయ నియమాల ప్రకారం, 1982 ఐక్యరాజ్య సమితి తీర్మా నం ప్రకారం ఆసియాన్ దేశాలు నడుచుకోవాలని భార త్ సూచించింది. భారత్, ఆసియాన్ మధ్య ఉమ్మడి వి లువలు, గమ్యాలు గుర్తుచేస్తూ మోడీ ప్రసంగించారు. భారత్‌తో కలిసి ఆసియాన్ మొత్తం జనాభా 1.85 బిలి యన్‌లు అని చెప్పారు. ఇది ప్రపంచ జనాభాలో నాలు గో వంతు. వాటన్నిటి ఉమ్మడి జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

Comments

comments