Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

షూటింగ్‌ను అడ్డుకున్న పోలీసులు

SR-NTR

హైదరాబాద్ : ఉమ్మడి ఎపి మాజీ సిఎం, నటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న లక్ష్మీస్ వీరగ్రంథం షూటింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి జయం మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌టిఆర్ గార్డెన్‌లో ఆదివారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఎన్‌టిఆర్ ఘాట్‌లోని ఎన్‌టిఆర్ సమాధి వద్ద కేతిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఎన్‌టిఆర్ ఘాట్‌లో చిత్ర ప్రారంభోత్సవానికి అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పూజా కార్యక్రమం నిలిచిపోయింది. క్లాప్ కొట్టిన దర్శకుడు కేతిరెడ్డి సినిమా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తన చిత్ర నిర్మాణాన్ని అడ్డుకుంటే ఎన్‌టిఆర్ ఆత్మశాంతి యాత్ర పేరుతో లక్ష్మీపార్వతి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరిస్తానని దర్శకుడు కేతిరెడ్డి స్పష్టం చేశారు.

Police Intercepted the Lakshmi’s Veeragrantham Film Shooting

Comments

comments