Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమాను పూర్తిచేస్తా : కేతిరెడ్డి

laxmis

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆదివారం ఉదయం ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షూటింగ్‌కు అనుమతి లేదని… పైగా అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తులో సినిమా పేరు, వివరాలు లేవని వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే తాను పర్మిషన్ తీసుకున్నానని, ఎలాగైనా సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తానని కేతిరెడ్డి చివరికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ “ఎన్టీఆర్ ఆత్మ ప్రబోధం మేరకే నేను ఈ సినిమా తీస్తున్నాను. ఇందులో లక్ష్మీపార్వతి పాత్రను గౌరవప్రదంగా, ఆదర్శ గృహిణిలా చూపుతున్నాను. మా మూవీకి లక్ష్మీపార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ జీవితం మొదటి అధ్యాయాన్ని దర్శకుడు తేజ, బాలకృష్ణ కలిసి సినిమాగా రూపొందిస్తుండగా… చివరి అధ్యాయాన్ని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సినిమా రూపంలో తీసుకురాబోతున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని మధ్య అంకాన్ని మా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాలో చూపిస్తాం. అయితే రామ్‌గోపాల్‌వర్మ, తేజలు రూపొందించే ఎన్టీఆర్ సినిమాలకు కావాల్సిన మద్దతు ఇస్తామని తెలిపిన లక్ష్మీపార్వతి మా సినిమాకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని అడుగుతున్నా. అన్నగారి ఆదేశం ప్రకారమే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను కాబట్టి లక్ష్మీపార్వతి మా సినిమాకు కూడా మద్దతు ఇస్తే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమాను మాత్రం పూర్తిచేసి విడుదల చేస్తాము”అని అన్నారు. జయం మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జి.విజయ్‌కుమార్ గౌడ్ నిర్మించనుండగా సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి సమర్పకులు. ఈ చిత్రానికి కెమెరాః సుధాకర్ రెడ్డి, మూల కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వంః కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.

Comments

comments