Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

లోకాయుక్త బిల్లు సిద్ధం

ts1 ద్వితీయ అధికార భాషగా ఉర్దూ 

హైదరాబాద్ : తెలంగాణ లోకాయుక్త ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ లోకాయుక్త బిల్లును సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ బిల్లును సర్కులేషన్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే రెండు రోజులుగా లోకాయుక్త బిల్లు రూపకల్పనలో అధికార యాంత్రాంగం నిమగ్న మై ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా లోకాయు క్త ఉంది. లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవులకు అర్హతలు ఏ విధంగా ఉంటాయనే దానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా హైకోర్టు రిటైర్డు జడ్జిని లోకాయుక్తగా నియమించే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
ఉర్దూ ద్వితీయ భాషపై చట్ట సవరణ : రాష్ట్ర వ్యాప్తం గా ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేసేందుకు ప్రభుత్వం చట్టంలో సవరణ తీసుకుస్తోంది. ఇం దుకోసం సవరణ బిల్లును రూపొందించారు. నేడో రేపో సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఖమ్మం మినహా పాత ఉర్దూ ద్వితీయ భాషగా అమలవుతోంది.

Comments

comments