Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ప్రధాని అదృశ్యం

HARIRI

బీరట్ : లెబనాన్ ప్రధాని సాద్ హరిరి అదృశ్యమయ్యారు. ఇటీవల ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఆయన కనిపించకుండాపోయారు. ఇదిలా ఉండగా హరిరి సౌదీ అరేబియాలో కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీంతో లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ అరేబియాతో సంప్రదింపులు కూడా జరిపారు. తమ ప్రధాని హరిరి ఇంతవరకు స్వదేశానికి ఎందుకు తిరిగి రాలేదో చెప్పాలని అధ్యక్షుడు మైఖెల్ అవాన్ కోరారు. ఇటీవల సౌదీ అరేబియాలో హరిరి పర్యటించారు. ఈ సందర్భంగా నవంబరు 4వ తేదీన రియాద్‌లోని ఓ టివి ఛానల్‌తో హరిరి మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని, ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రిని చంపినట్టే తనను కూడా చంపేస్తారోమోనని ఆయన ఆవేదనతో చెప్పారు. ఆ తరువాత హరిరి లెబనాన్‌కు తిరిగి రాలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇదిలా ఉండగా హరిరి రాజీనామాను అధ్యక్షుడు మైఖెల్ ఇంత వరకు ఆమోదించలేదు.

Prime Minister Missing

Comments

comments