Search
Wednesday 22 November 2017
  • :
  • :

బాలల హక్కులను పరిరక్షించాలి : కలెక్టర్

ydd

యాదాద్రి భువనగిరి: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక గంజ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని జ్యోతి వెలిగించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగించేవారు చట్టరిత్యా శిక్షార్హులని, ఇబ్బందులకు గురైన వారు వెంటనే 1098 నెంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకునేలా పిల్లలు తమ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఆమె కోరారు. బాలబాలికలు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు సాధించాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కలె క్టర్ పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సి పల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య మాట్లాడుతూ పిల్లలు దేవుని ప్రతి రూపా లని, వారికి క్రమశిక్షణ, నాణ్యమైన విద్య నందించి రేపటి పౌరు లుగా తీరిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ అధికారి శారద మాట్లాడుతూ పిల్లలు బడిలో తప్ప పనిలో ఎంతమాత్రం ఉండరాదని ,బడి ఈ డు పిల్లలందరు బడికి వెళ్లాలని కోరారు. చదువుతో పాటు ఆటపాటల లో రాణించాలని, జిల్లాలో బాల్యవివాహాలు, ఇతర రుగ్మతలను గుర్తిం చి వెంటనే తెలియజేసినచో చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బాలల హక్కులపై పిలుపు సంస్థ రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరిచారు. బాలల హక్కులపై మండల, జిల్లా స్థాయి లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో బాలల న్యాయమండలి బోర్డు సభ్యులు రామిరెడ్డి , పిలుపు సం స్థ ప్రతినిధి జనార్ధన్ సిడిపిఓలు , అంగన్‌వాడీ కార్యకర్తలు , స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు. బాలబాలికలు దేశ నాయకుల వస్ర్తధారణ ప్రదర్శించగా పలువురిని అలరించాయి. చాచా నెహ్రూ వేషధారణలో ఉన్న చిన్నారికి గులాబితో కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments