Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

నేడు ఆదిలాబాద్‌లో నిరసన జ్వాలలు

prayer

ధనిక రాష్ట్రంను అప్పుల రాష్ట్రంగా తీర్చిన ఘనత కేసిఆర్‌ది
అధికారికి కొమ్ముకాస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : పాత నోట్ల రద్దు చేసి రేపటికి సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దినంను బ్లాక్ డేగా ప్రకటించి రాష్ట్రంలో నిరసన జ్వాలాలు చేపడుతున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముందుగా భారీ బహిరంగా సభను నిర్వహించిన అనంతరం కోవ్వతులతో ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ భారీ బహిరంగ సభకు మాజీ హోం మంత్రి సబీత ఇంద్రరెడ్డి హాజరవుతుందన్నారు.విదేశాలల్లో ఉన్న నల్లడబ్బు ను రప్పించలేని చేతకాని బిజెపి ప్రభుత్వం నోట్లను రద్దు చేసి సామన్యుడి కష్టాలకు కారణమైందన్నారు.ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తీర్చిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు.కేసిఆర్ రాష్ట్రంలో పిట్టలదొరలగా వ్యవహారిస్తున్నారన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధుల అవినీతితో సారంగాపూర్ మార్కెట్ యార్డ్‌లో రూ.60 లక్షల అవినీతి జరిగిందన్నారు.నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ అవినీతికి ముఖ్యపాత్ర పోశిస్తున్నారన్నారు. జేసిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా హాస్తాముందన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఒక అధికారి అవినీతి చేస్తుంటే అతడికి అండదండలు అందిచడం ఎంతవరకు సమంన్‌జసం అన్నారు. అధికారిపై మంత్రి పై విజిలేన్స్ విచారన చేపట్టాలని డిమాండ్ చేశారు.అలాగే జిల్లాలోని ప్రతీ కొనుగోలు కేంద్రాలపై సమగ్ర విచారన జరపాలన్నారు.లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడుతామన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అయ్యన్నగారి పోశెట్టి, జమాల్, అజాత్, దినేష్, సంతోష్, ప్రవీన్, పద్మాకార్, ముత్యంరెడ్డి, రమణ, చంద్రకాంత్, హైదర్, సాయి, అన్వర్, మోయిన్ తదితరులు ఉన్నారు. 

Comments

comments