Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

జల జగడం

nzb

*గేట్ల ఎత్తివేతకు ఏర్పాట్లు
*సింగూర్ నీటిపై నిరసనల వెల్లువ
*టిడిపి, కాంగ్రెస్ పోరుబాట
*సాగర్‌ను ముట్టడించిన కాంగీ నేతలు
*అంతటా సింగూర్ జలాల చర్చే

బాన్సువాడ: సింగూర్ జలాలను శ్రీరాంసాగర్ మీదు గా మిడ్ మానేరు లోయర్ డ్యాంకు తరలించే విషయంలో  జల జగడం ప్రారంభమైంది. చరిత్రలో లేని విధంగా సింగూర్ నీటిని దిగువకు తరలించే అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. సింగూర్ నీటి వినియోగంతో పాటు నిజాంసాగర్ నీటి విడుదల వరకు ప్రస్తుతం రైతాంగంతో పాటు ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, లెప్ట్ పార్టీల నేతలకు పోరుబాటను పట్టించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సిం గూర్ ప్రాజెక్టును నిర్మించిన నాటి నుండి నేటి వరకు ప్రాజెక్టులో ఉన్న జలాలను ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లా వాసులకు మాత్రమే పరిమితం చేశేవారు. కాని ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభు త్వం సింగూర్ నీటిని దిగువ ప్రాంతంలోని మళ్లించి ఆ నీటిని శ్రీరాంసాగర్ గుండా కరీంనగర్ ప్రాంతంలోని మానేరు డ్యాంకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు, గత వారం రోజులుగా సింగూర్ నుండి నిజాంసాగర్‌లోకి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. నిజాంసాగర్ నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తు తం నీటిమట్టం 1404.405 అడుగులతో కొనసాగుతోంది. సిం గూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 29.923 టిఎంసీలు  కాగా, ప్రస్తుతం 24.600 నీటి నిల్వతో కొనసాగుతోంది. నిజాంసాగర్ కు 10 టిఎంసీలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు 5 టిఎంసీల నీరు చేరుకుంది. గురువారం ఉదయం సింగూర్ ప్రాజెక్టు గేటులను ఎత్తి 19 వేల600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించి 80 ఏళ్లు దాటినప్పటికీ  ఇప్పటి వరకు  సింగూర్ జలాలను మళ్లించే  పరిస్థితి రాలేదు. నిజాంసాగర్‌కు బ్యాలెన్స్ రిజర్వాయర్‌గా సింగూర్ నిర్మాణం చేపట్టారు. ఐతే కాలానుగుణంగా మిడ్ మానేరు లోయర్ డ్యాంలోకి 15 టిఎంసీల నీటి ని నింపుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు  చేసింది.  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు కూడా వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి పోచంపాడ్ మీదుగా 4 టిఎంసీల నీటిని మిడ్ మానేరు డ్యాంలోకి తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా గత మూడేళ్ల కాలంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల సాగునీటి కోసం అల్లల్లాడి పోయారు. గత ఏడాది కురిసిన వర్షాలతో సాగర్ ప్రాజెక్టు నీటిసందడి చేయగా రైతల్లో ఆశలు చిగురించాయి. ఈ యేడు యాసంగి పంటకు సాగు నీటి డోకా లేదని బావించిన రైతాంగానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇరుకాటంలో పడేసింది. ఇక్కడి నీటిని శ్రీరాంసాగర్ మీదుగా మానేరు డ్యాంకు తరిలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వదంతులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో స్సందించిన ప్రతిపక్షాల ఇదే ఎజెండాగా తీసుకొని పోరుబాటకు శ్రీకారం చుట్టారు. గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర టిడిపి కార్యదర్శి అమర్‌నాథ్ బాబు ఆద్వర్యంలో నిజాంసాగర్ ముట్టడికి యత్నించారు. అట్టి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని ప్రాజెక్టులోకి చొచ్చుకు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, తాజాగా కాంగ్రె స్ పార్టీ ఆద్వర్యంలో గురువారం బాన్సువాడ నియోజక వర్గ శ్రేణులు నిజాంసాగర్ ముట్టడీకి యత్నించారు. బాన్సువాడ నుండి నిజాంసాగర్  వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఏదిఏమైనా సింగూర్ జలాలను పరిరక్షించుకోవాలన్న తపన ప్రతిపక్షాలకు ఉండగా, రైతులకు అవగాహన పరిచే విషయంలో అధికార పార్టీ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు.

Comments

comments