Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఫ్యామిలీకి ఫ్యామిలీ తీన్‌మార్ స్టెప్పులే…

Rajasekhar-Dance

యాంగ్రీయంగ్‌మెన్ రాజశేఖర్ చాలా రోజుల తరువాత ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎమ్’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో హీరో రాజశేఖర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. రాజశేఖర్‌తో పాటు ఆయన సతీమణి జీవిత, ఇద్దరు కూతుళ్లు సంతోషంతో డ్యాన్స్ చేశారు. రాజశేఖర్ అయితే తీన్‌మార్ ఆడారు. ఈ వేడుకలో మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్, శ్రద్ధాదాస్ ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు. మూవీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఆనందంగా చిందులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


Courtesy by  YoYo TV

Comments

comments