Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

త్వరితగతిన ఎస్‌ఎల్‌బిసి పనులు

walk

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/అచ్చంపేటఃనల్గోండ జిల్లాకు సాగు,తాగు నీరందించే ందుకు మన్నేవారిపల్లి నుండి శ్రీశైలం ఎడవ గట్టు వరకు చేపడుతున్న శ్రీశై లం లిప్టు బ్యాక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేప ట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నా రు.శుక్రవారం దోమలపెంట వద్ద జరుగుతున్న సొరంగ మార్గం పనులను ఆయన స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.ప్రాజెక్టు పనుల సందర్శనకు వెళ్ళిన ఆయనకు అధికారులు మర్యాద పూర్వకంగా కలుసు కోని సాంకేతిక అంశాలను వివరించారు.2004లో మన్నేవారిపల్లి వద్ద స్వర్గీ య మాజీ సిఎం వైఎస్‌ఆర్ ఈ ప్రాజెక్టు పనులను ప్రారం భోత్సవం చేశారని అధికారులు ఆయనకు వివరించారు.2వేల కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల నల్గోండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ బారి నుండి కాపాడాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం పనులను మొదలు పెట్టింది. 47కిలో మీటర్ల సొరంగ మార్గం పనులను చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు 29కిలో మీటర్లు పూర్తి చేసిన్నట్లు తెలిపారు.దోమలపెంట వద్ద సుమా రు 300 అడుగుల లోతు నుండి సొరంగం పనులు చేపడుతున్నట్లు తెలిపా రు.దేశంలోనే ఈ రెండవ అతిపెద్ద సోరంగం మార్గం పనులు చేసేందుకు ఆస్ట్రేలియా టేక్నాలజి అధికారుల సహాయంతో రెండు టన్నేల్ బోర్ మిషన్‌ల ను ఉపయొగించి రెండు వైపుల నుండి పనులను చేపట్టారు.ఈ రెండు బోర్ మిషన్లు పనులు పూర్తయిన వెంటనే లోపలనే వదిలేయడం జరుగుతుంద న్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేతలు అరుణ్,రమేష్ నాయడు, విక్రం,మదన్‌లు పాల్గొన్నారు.

Comments

comments