Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

రాజుకుంటున్నజల రగడ

river

*సింగూరు జలదోపిడీ ఆపండంటూ స్థానికుల డిమాండ్
*ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్న జిల్లా విద్యావంతుల వేదిక
*సింగూరు నీటి అక్రమ తరలింపు ఆపాలంటూ కలెక్టరేట్‌లో సిపిఎం నిరసన

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: సింగూరు జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించడం మెదక్, సంగారెడ్డి జిల్లా వాసుల నోట్లో మట్టి కొట్టడమేనని, ప్రభుత్వం తక్షణమే జలదోపిడిని నిలిపివేయాలని జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక ప్రకనట ద్వారా తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో ఎస్‌ఆర్‌ఎస్పిలోకి 15 టిఎంసిల నీటిని సింగూ రు నుండి విడుదల చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే సాగునీటి వసతి లేని ఏకైక జిల్లా మెదక్ జిల్లానేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు సామర్థం 29 టిఎంసిలు ఉండగా, వాటిలోంచి 15 టిఎంసిలు ఎస్‌ఆర్‌ఎస్పీకి వదు లుతే మిగిలిన 14 టిఎంసిలలో హైదరాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా వాసుల తాగునీటికి 8 టిఎంసిలు పోగా మిగిలిన 6 టిఎంసిలలో ఘనపూర్ ఆయకట్టకు రెండు పంటలకు గాను 4 టిఎంసిలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందంతా పోగా కేవలం రెండు టిఎంసిలు మాత్రమే సింగూరులో మిగులుతుందన్నారు. సింగూరు ఎత్తిపోతలకు కనీసం 8 టిఎంసిల నీరు అవస రమని వారు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీకి నీరు తరలిపోవడం వలన భవిష్యత్తులో మెదక్ జిల్లాకు తీవ్ర తాగునీటి సమస్య తీవ్రతరమవ్వనుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు పరిధిలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని లోంగదీసి నీటిని దోచేస్తుంటే ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకునీరేత్తనట్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారన్నారు. నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు అవసరమైతే రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున డిమాండ్ చేశారు. పాత ప్రభుత్వ ఉత్త ర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం ఘనపూర్ ఆయకట్టులోకి రెండు పంటలకు 4 టిఎంసిల నీటి ని వదలాలి కానీ, ప్రతి సంవత్సరం ఘనపూర్ ఆయకట్ట ప్రాంత రైతులు నీటి పారుదల శాఖ మంత్రి కాళ్లు పట్టుకొని బ్రతిమాలాడితేనే విడుతల వారిగా పంటకు ఎనిమిది సార్లు నీటి విడుదల చేస్తున్నారని వారు విచారణ వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా విద్యావంతుల వేదిక తరపున సిం గూరు నీటిని సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగు, సాగు కు కేటాయించాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరు స్వచ్ఛందంగా స్పందించి జల దోపిడిని అడ్డుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జం గిటి క్రిష్ణ, బిమరి గణేష్, కోశాధికారి హన్మకోండ ద యాసాగర్, పిడి. ఆనందం, నరహరి, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నీటి అక్రమ తరలింపు నిలిపివేయాలని 
సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం
సింగూరు ప్రాజెక్టు నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లా హక్కుగా ఉన్నాయని, శ్రీరాంసాగర్‌కు వదులుతున్న 15 టిఎంసిల నీటిని వెంటనే నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ భారతిహోళికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు తాగునీటితో పాటు నిజాంసాగర్‌కు 6 టిఎంసిలు పోగా మిగితా నీరంతా ఉమ్మడి మెదక్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలకే వినియోగించాలని స్పష్టమైన ఒప్పందం ఉందన్నారు. సింగూరు ప్రాజెక్టు నీళ్లు కాళీ అవ్వడం వల్ల మెదక్ జిల్లాలోని పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్, కౌడిపల్లి, టేడిపల్లి మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, వెంటనే సింగూరు నుం డి తరలిస్తున్న నీటిని ఆపాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments