Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

భరత్‌రెడ్డి అరెస్టు కోసం రాస్తారోకో

nzb

ఎడపల్లి/ రుద్రూర్ (నిజామాబాద్ జిల్లా) : నవీపేట మండలంలోని అభంగ పట్నంలో దళితులపై దాడి చేసిన బిజెపి నాయకుడు భరత్ రెడ్డిని అరెస్టు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ నిజామాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి భరత్‌రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ జంగం గంగాధర్ మాట్లాడుతూ భరత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేసారు. లేకుంటే జిల్లా వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాయకులు మాల పెద్దులు, శ్రీనివాస్, రాములు, సాయి లు, నర్సింలు, ఎంఆర్‌పిఎస్ మహిళ జిల్లా అధ్యక్షులు సావిత్రి, నాయకులు లక్ష్మణ్, నారాయణ పాల్గొన్నారు.
రుద్రూర్‌లో ప్రజాసంఘాల రాస్తారోకో : దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించి అవమాన పరిచిన బిజెపి నాయకుడు భరత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభంగపట్నంలో దళితులపై అనుచితంగా అవమానించిన భరత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ నన్యాసాబ్, బహుజన సమైఖ్య జిల్లా అధ్యక్షులు అశోక్ కాంబ్లే, నామ్‌శంకర్, కిశోర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments