Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రాముని చెరువు రాబందులపాలు

 

 

riverశిఖం భూముల్లో అక్రమంగా రోడ్డు నిర్మాణం
రాజకీయ నేతల అండదండలతోనే ఆక్రమణలు
కోట్లాది రూపాయల విలువ చేసే భూములు స్వాహా
శిఖం భూములవైపు కన్నెత్తిచూడని అధికారులు

కోట్లాది రూపాయల విలువ గల చెరువు శిఖం భూములను కొందరు అక్రమార్కులు ఎక్కడికక్కడే మింగేస్తున్నారు. ఇప్పటికే ఎకరాల కొద్ది భూమి రియల్ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోగా మిగిలిన భూములను రాజకీయ నేతల అండదండలతో తన్నుకుపోతున్నా రు.  ఎంతో విలువైన శిఖం భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతుండగా అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర  పోషిస్తోంది. బడా నేతల హస్తం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఎకరాల కొద్ది భూములు ఇప్పటికే కబ్జాకు గురికాగా తాజాగా కొందరు అక్రమార్కులు శిఖం భూముల్లోనే  రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు శిఖం భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. సర్వే నెం. 406లో 42.22 ఎకరాల శిఖం భూములు ఉన్నట్లుగా అధికారులు సర్వే నిర్వహించి,హద్దురాళ్లను సైతం ఏర్పాటు చేశారు. శిఖం భూములు ఆనుకొని కొందరు రియల్ వ్యాపారులు హైటెక్ సిటీని ఏర్పాటు చేశారు. అయితే హైటెక్ సిటీలో నిర్మిస్తున్న కట్టడాల్లో ఇప్పటికే కొన్ని భవనాలను చెరువు శిఖం భూముల్లో నిర్మించగా వివాదాలు కోర్టుకెక్కాయి. ప్రస్తుతం చెరువు శిఖం భూముల్లో రోడ్లు నిర్మిస్తుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. హైటెక్ సిటీలో నిర్మించిన ఇండ్లకు సంబంధించిన సెప్టిక్ ట్యాంక్‌లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కాల్వలను సైతం శిఖం భూమిలోనే అక్రమంగా నిర్మించారు. రాముని చెరువుశిఖం భూముల వివాదం 11 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండడంతో గతంలో సర్వే చేసిన అధికారులు సైతం రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గాబాధ్యతలు స్వీకరించిన ఆర్వీకర్ణన్ ఆదేశాలమేరకు చెరువు శిఖం భూములను సర్వే చేసి, హద్దురాళ్లను ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు యదేచ్చగా భూముల కబ్జాకు పాల్పడుతున్నారు. ఏదిఏమైన కోట్లాది రూపాయాల విలువ చేస్తే రాముని చెరువు శిఖం భూములను పరిరక్షించే విషయంలో అధికారులు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments