Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

విష సర్పాల మధ్య… జనజీవనం..

Sneke-image

రంగసముద్రం రిజర్వాయర్ దగ్గర  నాగరాల గ్రామస్తుల జీవనం అస్తవ్యస్తం..

మన తెలంగాణ/శ్రీరంగాపురం: మండల పరిధిలోని నాగరాల గ్రామంలో శ్రీరంగసముద్రం రిజర్వాయర్ కింద ముంపుకు గురైన నిర్వాసితులు ప్రాణాలను కాపాడుకుంటూ బిక్కుబిక్కుమంటు జీవనాన్ని గడుపుతున్నారని గ్రామ సర్పంచ్ నిర్మలా రాధాకృష్ణ అన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగి తమ నివాసాలను రంగసముద్రం నీరు నలువైపుల నిర్వాసితుల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. విద్యార్థులు రవాణాసౌకర్యం లేక పాఠశాలలను మానుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని నాగరాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని కొత్త జిఒ ప్రకారం పునరావాస నష్టపరిహారం చెల్లిస్తే తక్షణమే ఖాళీ చేసి కొత్త ఆర్‌ఆండ్ సెంటర్‌ల్లోకి తరలి వెళ్తామని నాగరాల గ్రామ నిర్వాసితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయించాలని సర్పంచ్ నిర్మళా రాధాకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీధర్, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

భయం..భయంతో బతుకుతున్నాం..
రంగసముద్రం నీరు గ్రామాన్ని చుట్టుముట్టడంతో జన జీవనం స్తంబించిపోతుంది. రాత్రి వేళ పాముల భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం. తక్షణమే గ్రామస్తులను కాపాడాలని సర్పంచ్ నిర్మళా రాధాకృష్ణ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

                                                                                                                                                          నాగరాల సర్పంచ్ నిర్మలా రాధాకృష్ణ

Comments

comments