Search
Wednesday 20 June 2018
  • :
  • :

రేషన్ పరేషాన్

ration

ప్రభుత్వ యోచనపై కార్డుదారుల్లో ఆందోళన
నగదు బదిలీపై సర్వత్రా ఉత్కంఠ
సబ్సిడీ బియ్యానికి మంగళవారం
వాటి స్థానంలో సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్

మన తెలం గాణ/ ఆసిఫాబాద్ :   రేషన్ దుకాణాల ద్వారా తె లుపురంగు కార్డులకు పంపిణీచేసే బియ్యంపై లబ్దిదారులు అనాసక్తి చూపుతున్నారని , బియ్యానికి ప్రత్యామ్నాయంగా నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రభుత్వ యోజన సర్వత్రా చర్చకు తెరలేపింది. చౌకధరల దుకాణాల ద్వారా కిలో బియ్యానికి రూ. 26.66  రూ పాయల చొప్పున 5 గురు కుటుంబ సభ్యులుంటే రూ. 800 ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీకి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కుమ్రం భీం జి ల్లాలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యాన్ని ఎ క్కువ మంది లబ్దిదారులు తీసుకోవడం లేదన్నది ని జం.  ఫలితంగా ఇచ్చిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులతో క లిసి పలుమార్లు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న క్విం టాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 275 రేషన్ దు కాణాలు ఉన్నాయి. 15 మండలాలలో 4,63,707 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డుల ద్వారా బియ్యాన్ని అందుకుంటున్నారు. ఇం దులో సాధారణ కార్డులు 1,23,555 , అంత్యోదయ కార్డులు 12,904, అన్నపూర్ణ కార్డులు 23 మొత్తం 1,35,756 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 4,63,707 మంది సభ్యులు ఉన్నారు. ప్రతీ నెల సంబంధిత కుటుంబాలకు 2,96,450 కేజిల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. బియ్యంతోపాటు కిరోసిన్ వంటివి పంపిణీ చేస్తున్నారు. వీరిని జిల్లాలోని 275 రేషన్ దుకాణాల ద్వారా కార్డు దారులకు బియ్యాన్ని అందిస్తున్నారు. సాధారణ ఆహారభద్రత కార్డు దారులకు రూపాయికి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున అందజేస్తుండగా అదే అంత్యోదయ కార్డుల ద్వారా 35 కిలోలు ఇస్తున్నారు. అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా బియ్యాన్ని పం పిణీ చేస్తున్నారు. తెలుపురంగు కార్డుదారుల నుండి తీసుకుంటున్న బి య్యాన్ని దళారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని పక్కనే ఉన్న మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గ్రామాలలో దళారులు కార్డుల నుండి కిలోకు రూ. 12 నుండి 10 రూపాయల చొప్పున తీసుకుంటూ వాటిని రైస్ మిల్లులలో మార్పించి ఇతర రాష్ట్రాలలో కిలోకు రూ. 25 చొప్పున విక్రయించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. కొన్ని సందర్భాల లో అధికారులు దాడులు చేసి బియ్యాన్ని పట్టుకోవడంతో దళారులు రూ టుమార్చి నేరుగా రైస్‌మిల్లులకే రేషన్ బియ్యాన్ని తెప్పించుకుని అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు.
నగదు బదిలీపై మిశ్రమ స్పందన ….
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గ్యాస్ సిలిండర్ రాయితిని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసింది. ఇంకా పూర్తిస్థాయిలో ప్రజ లకు అందబాటులో ఉండడం లేదు. బ్యాంకు ఖాతాలో ఎంత రా యితి సొమ్ము పడింది. ఎప్పుడు పడిందన వివరాలను సామాన్య ప్రజల కు తెలియడం లేదు. ఆన్‌లైన్ బుకింగ్ చేస్తూ గ్యాస్ మొత్తం ధరను చె ల్లిస్తున్నారు. రాయితీ సొమ్ము పడితే పడినట్లు… లేకుంటే లేదు. తాజాగా ప్రభుత్వ ఆహార భద్రతా విషయంలోను బియ్యం సరఫరాను నిలిపివేసి నగదు బదిలీ చేయాలనే ఆలోచనపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. రేషన్ దుఖాణాల్లో అమ్మహస్తం కింద 11 రకాల వస్తువులను ప్రవే శపెట్టారు. తర్వాత అవికాస్త కనుమరుగై కేవలం బియ్యం, కందిపప్పు, గోదమలు, చక్కెర, కిరోసిన్‌లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు అవికూ డా ఇవ్వడం లేదు. ఇప్పటికి రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే వస్తువులపై వ్యతిరేకత ఉన్నందున తాజాగా ప్రభుత్వం నగదు బదిలీపై స్పందన ఎలా ఉం టుందోనని నిఘా వర్గాలు ఆరా తీయనున్నాయి. ఈ నిఘా వర్గాల నివే దికల తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇంకా ఆదేశాలు జారీ కాలేదు : డీఎస్‌ఓ శ్రీనివాస్
బియ్యం నగదు బదిలీ అంశంపై మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత లేదు.మా వరకయితే ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ కాలేదు. స్పష్టత వచ్చాక వీటిని పరిశీలిస్తాం.

Comments

comments