Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

పురాతన ఆలయాలకు ఆదరణ కరువు

tempale

మనతెలంగాణ/నర్సింహులపేట: మండలంలోని జయపురం గ్రామంలో చరిత్రాత్మకమైన రెండు పురాతన దేవాలయా లు శ్రీ సీతారామాచంద్రస్వామి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి ఆలయాలకు అధికారుల పర్యవేక్షణలు లేక ఆదరణ కరువైంది. బాధలు తీర్చాలంటూ మొక్కులు మొక్కుకోని కోర్కెలు తీర్చుకోవాలనే భక్తుల ఆశలు నిర్వీర్యమవుతున్నాయి. దేవాదా యా శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కనీసం దేవ తామూర్తుల గేటు తాళాలు తెరిచి దీప, ధూప నైవేద్యాలు అందించేవారే లేరు. మండల కేంద్రంలోని ఊరు మధ్యలో ఈ రెం డు అతి పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. దేవాలయాలకు మధ్యన ప్రాకార మండపం ఉంది. ఇది పూర్తిగా రాతితో నిర్మించారు. జైనులు క్రీ.పూ.468 సంవత్సరం నుండి 540 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతంలో జైనుల సామ్రాజ్య విస్తరణ జరిగింది. రాజ్య విస్తరణ జరిగిన క్రమంలో ఓరుగల్లు ప్రాంతంలో వర్థమానుడు అనేరాజు పరిపాలనలో ఈ రెండు గుళ్ళు మరియు మండపాన్ని జైనులు నిర్మించినట్లు చెన్నకేశవస్వామి దేవాలయం ముందు భాగం ప్రాకారంపై శిలశాసనం ద్వారా తెలుస్తుంది. ఊరికి మధ్యలో తూర్పు ముఖద్వారంగా చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి ఆంజనేయస్వామి ఆలయం ఊరికి ఎడమవైపు భాగంలో సీతారామస్వామి ఆలయం దేవుని చెరువు కింది భాగంలో ఉంది. ఆ రెండు దేవాలయాల మధ్య ఒక ఎత్తైన ప్రదేశంలో నాలుగు ఎత్తైనరాతి స్తంభాలతో మండపం నిర్మించారు. ఇంత ఎత్తైన మండం ఏ ఆలయంలో లేదని ఈ దేవాలయాలను దర్శించుకోవడానికి గతంలో రాష్ట్ర నలుమూలలనుండి సుదూ ర ప్రాంతాల భక్తులు, పర్యాటకులు వచ్చి దేవాలయాలలో దర్శ నం చేసుకొని వెళ్లేవారు. తరువాత ఈ ఆలయాలు కాలక్రమేనా మరుగునపడిపోయాయని విశ్లేషకుడు నెలకుర్తి చెన్నారెడ్డి తెలిపారు. ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని గ్రామీణ ప్రాంతాలలోని పురాతన దేవాలయాలను కాపాడవలసిన బాధ్యత పురావస్తుశాఖ వారికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయశాఖ ఈ ఆలయాలను స్వాధీనపర్చుకొని పూజారులను నియమించి ప్రతిరోజు దీపారాధనతో పూజలు చేయించాలని పలువురు కోరుతున్నారు. చీకట్లో ఉన్న దేవాలయాలను వెలుగులు నింపుతూ వెలుగులోకి తేవాలని జయపురం గ్రామ పెద్దలు, ప్రజలు కోరుతున్నారు.

Comments

comments