Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

Mahender

హైదరాబాద్ : తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థ కోసం రూ.16.48 కోట్లు కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారత్‌లో చెన్నయ్ తరువాత సిరిసిల్లలో అతి పెద్ద డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. క్లీనర్లు డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, ఈ క్రమంలో క్లీనర్లకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు.

 Reduced Road Accidents in Telangana

Comments

comments