Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పానగల్ రిజర్వాయర్ నుంచి..చెరువులకు నీటి విడుదల

house

*67 వేల ఎకరాలకు సాగు నీరు
*మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో హరీశ్‌రావు ఆదేశాలు

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద నున్న చెరువుల ద్వారా 67 వేల ఎకరాలకు సాగునీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు పానగల్ రిజర్వా యర్ నుండి చెరువులకు నీటిని విడుదల చేశారు. క్రింది ప్రాంతాల చెరువులు నింపాలని ఆయా ప్రాంతాల రైతుల విజ్ఞాపనల మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి ,హరీశ్‌రావులు అధికారులతో సమీక్షించి నీటిని విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. డి 39 కింద పెద్దసూరారం తుమ్మలచెర్వు, ఖాజీరామారం, ఖందారిపల్లి, పజ్జూరు నల్లకుంట చెరువు, చెరువుపల్లి, డి 40 కింద గంగన్నపాలెం, గడ్డికొండారం, గోరెంకలపల్లి, మంగలపల్లి నుంచి రెండు చెరు వులు, పజ్జూరు నుంచి తిప్పర్తి రెండు చెరువులు, సర్వారం, ఎడ్లకుంట, ఇండ్లూరు, ఆగామోత్కూర్ చెరువులకు ఫీడింగ్ జరుగుతుంది. డి 39 కింద ఇప్పటికే 5 చెరువులను నింపారు. డి 40 కింద మూడు చెరువులు నిండాయి. మరో పది చెరువులు నింపేందుకు ప్రయ త్నం జరుగుతుంది. అయిటిపాముల రిజర్వాయర్ పూర్తి సామర్ధం 0.18 టియంసీలు కాగా ప్రస్తుతం 0.12 టియంసీలు నిల్వ వున్నాయి. అయిటిపాముల రిజర్వాయర్ పరిధిలో 22 చెరువులు వుండగా మూసీద్వారా ఇప్పటికే 10 చెరువులను నింపారు. మరో 12 చెరువులను కూడా 75 శాతానికి పైగా నింపారు. డి 39 కింద 10,000 ఎకరాలు, డి 40 కింద 27,100 ఎకరాలు డి 41 నుండి డి 55 వరకు 30,000 ఎకరాలను మరో వారం పదిరోజుల్లో సాగులోకి తీసుకువస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పానగల్‌కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పానగల్ రిజర్వాయర్ పరిదిలోని చెరువులు, కుంటలను నింపడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Comments

comments