Search
Wednesday 22 November 2017
  • :
  • :

ఆ ఫోన్ యూజర్లకు జియో 100జిబి ఉచిత డేటా

Jio-Oppo-100GB-data-offer

ముంబయి: ప్రస్తుతం రిలయన్స్ జియో ప్రభంజనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జియో గత ఏడాదికాలంగా మిగతా టెలికాం ఆపరేటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వరుస ఆఫర్లతో కస్టమర్లను కట్టిపడేస్తోంది జియో. దీంతో ఇతర టెలికాం సంస్థలు జియోకి పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయినా జియోకి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో మొబైల్ తయారీదారు సంస్థలు జియోతో జతకట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కాగా, జియోతో భాగస్వామ్యంలో ఒప్పో తన మొబైల్ వినియోగదారులకు ఉచిత 4జి డేటాను అందించేందుకు ముందుకువచ్చింది.

దీనిలో భాగంగా గత నెల 27వ తేదీ తరువాత ఒప్పో మొబైల్స్ కొన్న కస్టమర్లు ఈ ఆఫర్ ప్రకటించింది. ఒప్పో ఎఫ్5, ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ కస్టమర్లు జియోలో రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జిబి 4జి డేటా చొప్పున మొత్తం 10 సార్లు చేసే రీచార్జిలకు గాను 100జిబి డేటా లభిస్తుంది.అలాగే ఒప్పో ఎఫ్1ఎస్, ఎ33ఎఫ్, ఎ37ఎఫ్, ఎ37ఎఫ్‌డబ్ల్యూ,ఎ71, ఎ57, మొబైల్స్  వాడుతున్న వినియోగదారులు కూడా రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జిబి డేటా చొప్పున మొత్తం 6 సార్లు చేసే రీచార్జిలకు గాను 60 జిబి డేటాను పొందే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 27, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.

Reliance Jio-Oppo 100GB data offer.

Comments

comments