Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

వృద్ధ కామాంధుడు

6,7 తరగతుల బాలికలపై ఏడాదిగా అత్యాచారం చేసిన 85 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 

Rapist

చర్లపల్లి : తాత అని నమ్మి వచ్చిన చిన్నారులకు మాయ మాటలు చెప్పి వంచించిన వృద్ధుడిని కటకటాలకు తరలించిన ఘటన కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో షీటీం అడిషనల్ డిసిపి సలీమా కుషాయిగూడ ఎసిపి కృష్ణ మూర్తితో కలసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ప్రథమపురి కాలనీలో నివాసముండే ఎన్.సత్యనారాయణరావు (85) రైల్వేలో ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. తన ఇంటి వద్ద ఉన్న పాఠశాలకు వచ్చే విద్యార్థినులను మచ్చిక చేసుకునేందుకు తరుచుగా వారికి చాక్లెట్స్ ఆశ చూపి చుట్టు పక్కల ఎవరూ లేని సమయంలో వారిపై అఘాయిత్యానికి పాల్పడుతుండే వాడు.

గత ఏడాది కాలంగా 6,7వ తరగతికి చెందిన విద్యార్థినులపై అత్యాచారం చేస్తూ ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించే వాడు. కాగా షీటీం అవగాహన సదస్సులలో భాగంగా మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు పాఠశాలలో కార్యక్రమం నిర్వహిస్తుండగా కొంత మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సత్యనారాయణరావు చేస్తున్న అఘాయిత్యాల గురించి వివరించారు. ఈ మేరకు అతని మీద ఆరు కేసులు నమోదు చేసి నింధితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఏడాది కాలంగా ఆరుగురు విద్యార్థినులపై అత్యాచారయత్నం చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. విద్యార్థినులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు నింధితుడిపై ఐపిసి సెక్షన్ 342, 363, 366, 376(2) పోస్కో యక్ట్ 5,6,3(2) కేసులతో పాటు బాధితుల్లొ ఇద్దరు ఎస్‌సి కులానికి చెందిన వారు ఉండటంతో ఎస్‌సి, ఎస్‌టి యాక్ట్‌తో పాటు పిడి యాక్ట్ పెడతామని షీటీం అడిషనల్ డిసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, ఎసైలు అశోక్‌కుమార్, శ్రీనివాస్, శ్రీశైలంనాయక్, షీటీం ఏఎస్‌ఐ బాలమల్లేష్ షీటీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహిళలను వేధిస్తే పిడి యాక్ట్ కేసు నమోదు : మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తామని షీటీం అడిషనల్ డిసిపి సలీమా, కుషాయిగూడ ఎసిపి కృష్ణముర్తి తెలిపారు.

నిత్యం స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లారు, ఎక్కడకు వెళ్లారు అని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడ్డా తమ దృష్టికి తీసుకు రవాలని కోరారు.

Comments

comments