Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ను దించే వరకు పోరాటం

revanth– కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి
కోస్గి: కెసిఆర్‌ను గద్దెదించే వరకు తన పోరాటం సాగతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పంచాక్షరీ ఫంక్షన్ హాలులో ఏర్పా టు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌పైన పోరాడాలంటే తన కున్న ఈ బలం సరిపోదని జాతీయ పార్టీ కాంగ్రెస్ బలంతోనే తన లక్షం నెరవేరుతుందన్న కారణంతోనే కాంగ్రెస్‌లో చేరానన్నారు. హరీశ్‌రావుకు కొడంగల్ బాధ్యతలు అప్పజెప్పిన కెసిఆర్‌కు ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలోని కార్య కర్తలందరూ ఏకమై తగిన విధంగా ప్రభుత్వానికి తగిన శాస్తి చెబుతారన్నారు. డబ్బులతో ప్రజలను కొనలేరని నీతి నిజాయతీ గల ప్రజలు ఎప్పుడూ అభివృద్ధ్ది వైపే మొగ్గు చూపుతారని ఆయన పేర్కొన్నారు. నా జీవిత మంతా ఈ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని కార్యకర్తల హార్షద్వానాల మధ్య ఆయన ప్రకటించా రు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకం, సిమెంట్ ఫ్యాక్టరీ, కోస్గిలో బస్ డిపో మొదలగు అభివృద్ధి పనులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచి ఈ ప్రాంత అభివృద్ధ్దిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధ్దిపైనే ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే నా హాయాంలో మంజూరు చేయించిన పథకాలను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సవాలు విసిరారు.అంగట్లో పశువుల్లాగా ద్వితీయ శ్రేణి నాయ కులను డబ్బులకు కొని రాజాకీయ వ్యాపారానికి పూనుకన్నారని మండిప డ్డారు. సోనియాకు అమేథీ ,వైఎస్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజక వర్గం ఎలాగో తనకు కొడంగల్ అలాగేనని పునరుద్ఘాటిం చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తనదే విజయమని 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

ఉద్యమాల గడ్డ..పాలమూరు జిల్లా : మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ  డికె అరుణ…పాలమూరు జిల్లాకు ఉద్యమాల గడ్డగా పేరుందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2009లో రేవంత్‌రెడ్డి మెదటి సారి శాసన సభ్యునిగా ఎన్నికైనపుడు నియోజకవర్గ అభి వృద్ది విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ తోను, రోషయ్యతోను, కిరణ్ కుమా ర్, విఠల్‌రావుల సహకారంతో నియోజకవర్గానికి పలు అభివృద్ది పనులు మంజూరు చేయిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం చేపట్టకపోవడం సోచనీచమన్నారు. గతంలో రేవంత్ నేను అభివృద్ది విషయం లో చర్చించామని ఈ మధ్య అధికార పార్టీ నాయకులు మామధ్య విభేధాలు ఉన్నాయని  చెప్పటం సమంజసం కాదన్నారు. ఇపుడు ఇద్దరం ఒకే పార్టీ తరు పున ప్రజల ఆకాఃఓలకనుగుణంగా అభివృద్ది విషయంలో ఏమాత్రం రాజీలేని పోరాలం చేస్తామన్నారు. కెసిఆర్ నియంత పాలన అంతమే తమ ఉమ్మడి లక్షమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వా ల్, దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జ్ పవన్‌కుమార్, సూర్యాపేట జిల్లా నాయ కులు పటేల్ రమేష్‌రెడ్డి,తిరుపతిరెడ్డి, సతీష్ మాదిగ నాయకులు వార్ల విజయ్ కుమార్, నాగులపల్లి నరెందర్, రాఘవరెడ్డి, సురేష్‌రెడ్డి,భీంరెడ్డి, బెజ్జు రాము లు, రఘువర్ధన్‌రెడ్డి,కృష్ణంరాజు,ఆసిఫ్, బాల్‌రెడ్డి, సుభాష్ నాయక్, ఎండి యూసుఫ్, ఇద్రిష్ పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Comments

comments