Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

యుద్ధప్రాతిపదికన రోడ్ల పనులు

kadiamవర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం జాతరకు రానున్న భక్తులు
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

వరంగల్‌బ్యూరో: మేడారం సమ్మ క్క- సారలమ్మ మహాజాతరకు దేశ నలుమూలల  నుంచి కోటిమందికిపైగా భక్తులు తరలివస్తారు. జా తరకు వెళ్లే ప్రధాన రహదారులు, బైపాస్‌రోడ్లు, జాతీ య రహదారి రోడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బిశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగనున్న నేపథ్యంలో సోమవారం ఉపముఖ్యమంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, జాతీయ రహదారులశాఖ, ఆర్‌అండ్‌బిశాఖ అధికారులు, ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కోటిమందికిపైగా భక్తులు వచ్చే మహా జాతర ఇది. ఇందుకు రోడ్లు అత్యంతప్రాధాన్యమైనందున, ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను  బాగు చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్ల అభివృద్ధిపనులు ప్రస్తుతం జరగాల్సినంత వేగంగా జరగడంలేదన్నారు. ఇకనైనా పనులు వేగంగా జరగకపోతే ప్రయాణికులు ఇబ్బందిపడుతారన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సం స్థ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, జాతీయ రహదారులశాఖ చీఫ్ ఇంజనీరు గణపతిరెడ్డి , ఎస్‌ఇ రాజారెడ్డి, ఈఈ హఫీజ్, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు హాజరయ్యారు.

Comments

comments