Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

దోపిడీ దొంగల అరెస్టు

THEFT-IN-JEDCHARLA

మహబూబ్‌నగర్ : జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన దారి దోపిడీలో కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు కారులో వెళుతున్న సైకిళ్ల వ్యాపారి రాం అవతార్‌ను దొంగలు అడ్డగించి రూ.3.84లక్షల నగదుతో పాటు కారును , సెల్‌ఫోన్‌ను తస్కరించారు. ఈ ఘటనపై బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మిడ్జిల్ పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అరెస్టు అయిన దొంగలను మంగళవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Robbers Arrested

Comments

comments