Search
Wednesday 22 November 2017
  • :
  • :

మునిసిపాలిటీకి రూ.10 కోట్లు

ktrపురపాలక సంఘాల్లో నియామకాలు చేపడతాం
30 జిల్లా కేంద్రాలకు మాస్టర్ ప్లాన్‌లు
ఎన్నికల్లోగా రూపురేఖలు మార్చుతాం : కెటిఆర్, హరీశ్

హైదరాబాద్: పురపాలక సంఘాల అభివృద్ధి కోసం ప్రతి మునిసిపాలిటీకి రూ.10 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక శాఖమంత్రి కె.తారకరామారావు ఈ నిర్ణయా న్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాల్లో సిబ్బం ది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. 30 జిల్లా కేంద్రా లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు వెంటనే పట్టణ మాస్టర్ ప్లాన్ రూపొందించి పంపాలని పురపాలక శాఖమంత్రి ఆదేశించారు. సిద్దిపేట పట్టణం సహా మరో 13 గ్రామాలు కలుపుకొని ‘సుడా’ గా మారుతున్నందున ఎలాంటి జాప్యం లేకుండా సిద్దిపేట మాస్టర్‌ప్లాన్ ఆమోదం కోసం పంపించాలని కోరారు. ఏడాది తర్వాత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మునిసిపాలిటీల రూపురేఖలు సంపూర్ణంగా మార్చాలని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మునిసిపల్ చైర్మన్లు, కమిషనర్లను మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీ సిద్ధిపేటలాగా ఆదర్శ మునిసిపాలిటీగా మారాలని కెటిఆర్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులతో సోమవారం నాడు సచివాలయంలో ఇద్దరు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిఎం ఆదేశాల మేరకు మంత్రులు ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ అధికారులను కోరారు. అంధోల్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉనన ఓడిఎఫ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తయారు చేసేందుకు పారిశుద్ధానికి అత్యంత ప్రాధానత ఇవ్వాలని కోరారు. ఇందుకోసం అవసరమైన రవాణా వాహనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  కోమటిచెరువు, వైకుంటధామం వంటి కార్యక్రమాలను కెటిఆర్ ప్రశంసించారు. 15 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలన్నింటినీ నగర పంచాయతీలుగా మార్చాలన్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, రామాయంపేట, సంగారెడ్డిలో నారాయణఖేడ్  పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

Comments

comments