Search
Sunday 27 May 2018
  • :
  • :

రోడ్ల విస్తరణకు రూ.1200 కోట్ల నిధులు

stand

*జిల్లాలో కొత్తగా వంతెనల
నిర్మాణాలు
*నిధుల కోసం కేంద్రానికి
ప్రతిపాదనలు
*బాన్సువాడలో పలు అభివృద్ధి
పనులకు శంకుస్థాపనలు చేసిన
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ:  రోడ్ల విస్తరణ కోసం 1200 కోట్ల రూపాయల నిధుల మం జూరుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని రాష్ట్ర మంత్రి పోచారం  శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం  ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వంతెనను ప్రారం భించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా హైవే లైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా జిల్లాలోని రోడ్ల ప్రగతికి 1200 కోట్ల రూపాయలు రానున్నాయని మంత్రి వివరించారు. నర్సా పూర్ నుండి బాసర వరకు రోడ్డు విస్తరణ కోసం ఆరు వందల కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే  మెదక్ నుండి రుద్రూర్ వరకు రోడ్డు విస్తరణ కోసం మరో ఆరు వందల కోట్ల రూపాయలను మంజూ రు చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని త్వరలోనే నిధులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా రుద్రూర్ నుండి పోతంగల్  మీదుగా మద్నూర్ వరకు రోడ్డు విస్తరణ కోసం మరో రకంగా నిధులను మంజూరు చేసుకునేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయన్నారు. ఇరుకైన వంతెనలతో తరుచూ రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయని, ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త వంతెనల ఏర్పా టుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో  భాగంగా నెమ్లీ, అంకోల్, కోత్తాబాదీ, రుద్రూర్, అక్బర్ నగర్ ప్రాంతాలలో కొత్త వంతెనల నిర్మాణాలు త్వరలోనే చేపడుతామని చెప్పారు. సకాలంలో వంతెన నిర్మాణం జరిగేలా చూసిన ఆర్‌అండ్‌భీ అధికారులకు, కాంట్రాక్లర్‌ను మంత్రి ప్రశంసించారు.
బోయి సంఘం ప్రారంభించిన మంత్రి
పాత బాన్సువాడలో నూతనంగా నిర్మించిన బోయి సంఘం కమ్యూనిటీ హాల్‌ను మంత్రి పోచారం ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, మత్సకా రుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో బాగంగా వారి బాగుకోరి నీలి విప్లవం పేరిట ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. చేపలను అమ్ముకునే పూర్తి అధికారాన్ని మత్సకారులకే వదిలి వేయడం జరిగిందన్నారు. మరో ఆరు లక్షల రూపాయలతో చేపట మార్కెట్ భవనాన్ని నిర్మించి పెడుతామన్నారు. మత్స్యకా రుల వద్దకు దళారులు వస్తే వారిని జైలుకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దళారులను నమ్మకుండా మత్స్య కారులే స్వయంగా అంగట్లో పెట్టి చేపలను అమ్ముకోవాలని సూచించారు. చేపలను కలకత్తా లాంటి దూర ప్రదేశాలకు తరలించాలను కుంటే ప్రభుత్వం తరుపున 16 లక్షల రూపా యలతో ప్రత్యేక ఎసి వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 2.81 లక్షల చేప పిల్లలను విడుదల చేయగా, నిజామాబాద్ జిల్లాలో 3.51 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ యేడు చేపల క్రాఫ్ కింద మత్సకారులకు రూ.700 కోట్లు లాభాలను అర్జిం చనున్నారని తెలిపారు.
వంతెనను ప్రారంభించిన మంత్రి
పాత బాన్సువాడ పెద్దవాగు నుండి బీర్కూర్‌కు వెళ్లే దారిలో నిర్మించిన వంతెనను మంత్రి పోచారం ప్రారంభించారు. 2.5 కోట్లతో నిర్మించిన ఈ వంతెన వల్ల రైతుల రాకపోకలకు అనుకూలంగా మారిందని పోచారం అన్నారు. దూర వ్యత్యా సం తగ్గడంతో పాటు పంట భూములకు వెళ్లెం దుకు ఈ వంతెన ఎంతో సదుపాయంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌డిఓ రాజేశ్వర్ , సర్పంచ్ దొన్కంటి వాణి, ఎంపిటిసీ ఆనిత, సొసైటీ చైర్మెన్ ఎర్వల కృష్ణారెడ్డి,జంగం గంగాధర్, దుద్దాల అంజిరెడ్డి, కొత్తకొండ బాస్కర్,ఎజాజ్, బాబా , నార్ల సురేష్, డాకయ్య, దేవికృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Comments

comments