Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఆర్టీసీ బస్సు కారు డీ.. కారు డ్రైవర్ మృతి

carమనతెలంగాణ/నర్సింహులపేటః మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆర్టీసీ బస్సు,కారు ఢీ కొని హూజూరబాద్‌కు చెందిన కల్లూరి సంతోష్ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటణ మండలంలోని పెద్దనాగారం గ్రామం సమీపంలోని ఖమ్మం- వరంగల్ ప్రదాన రహాదరి పై మంగళవారం చొటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం హూజూరబాద్‌కు చెందిన కల్లూరి సంతోష్ గత కొంత కాలంగా అంబర్ గుట్కా వ్యాపారం చేస్తూ పక్క రాష్ట్రల నుండి దిగుమతి చేసుకొని హోల్ సెల్ వ్యాపారం చేస్తున్నట్లుగా సమాచారం. గత కొంత కాలంగా మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో గుట్కా వ్యాపారం చేస్తున్నడు. ఈ బడ వ్యాపారి ఇక్కడాకు వచ్చి వ్యాపార నిమిత్తం వాచ్చి ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతుని ప్యాంటు జేబులో కొంత నగదు,కారు డిక్కిలో రెండు బస్తాల అంబర్ ప్యాకెట్స్‌లు దొరకడంతో ఇట్టి కథనానికి వాస్తవ రూపాం దాల్చింది. ఇట్టి విషయమై పోలిసులు ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదస్థలానికి సకాలంలో ఎస్సై నగేష్ చేరుకోని వారి బందువులకు సమాచరం అందించారు. బందువుల ఫిర్యాదు మేరకు కేసు నామోదు చేసి దర్యాప్తు చేయనున్నాట్లు ఆయన తెలిపారు.

Comments

comments