Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సిరియాలో రష్యా వైమానిక దాడులు

siriya

50 మంది బలి

మృతుల్లో 9 మంది చిన్నారులు
అల్పూ కమల్ పట్టణాన్ని దక్కించుకునేందుకు ఐసిస్,సైన్యం పరస్పర దాడులు

బీరూట్ : రష్యా వైమానిక దళాలు శనివారం సిరియలో దాడులు జరిపాయి. తూర్పు సిరియాలోని రెండు పునరావాస కేంద్రాలు, వాటి చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో జరిపిన వైమానిక, ఫిరంగు దాడుల్లో 50 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నట్లు సిరియా మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. ఉగ్రవాదుల చెర నుంచి అల్బూ కమల్ పట్టణాన్ని విడిపించేందుకు సైన్యం దాడులకు దిగింది. దీంతో పట్టణం నుంచి ప్రజలు పారిపోయి వచ్చి రెండు పునరావాస శిబిరాల్లో, గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. అయితే రెండు రోజుల క్రితమే ఐసిస్ ఉగ్రవాదుల కబంధ హస్తాల నుంచి అల్పూ కమల్‌ను సైన్యం చేజిక్కించుకుంది. కాగా, తిరిగి పట్టణాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఉగ్రవాదులు శనివారం దాడులు జరిపారు. దాడులను నివారించేందుకు రష్యా వైమానిక దాడులకు దిగింది. అల్ సుఖారియాలోని ఓ పునరావాస కేంద్రంపై జరిగిన బాంబు దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 15 మంది పౌరులు మృతి చెందినట్లు సిరియా మానవ హక్కుల పరిశీలకుడు రెమి అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. అదే విధంగా మరో పునరావాస కేంద్రం, దాని చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో జరిగిన బాంబు దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది పౌరులు మరణించారన్నారు. అల్పూ కమల్ పట్టణం కోసం జరుగుతున్న దాడులకు భయాందోళనకు చెందిన చాలా మంది స్థానికులు అక్కడి నుంచి తరలివెళ్లి కొంతమంది సమీప గ్రామాల్లోనూ, మరి కొంత మంది పట్టణ శివార్లలో తలదాచుకుంటున్నారు. దీంతో పట్టణమంతా ఖాళీ అయింది. 2011 నుంచి సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో 3.30 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Comments

comments