Search
Sunday 27 May 2018
  • :
  • :

ఆస్తి కోసం నాపై నాలుగు కేసులు: శ్రీనివాస్ రెడ్డి

Husband

హైదరాబాద్: మొదటి భార్య స్వాతికి విడాకులు ఇచ్చానని టిఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. మూడేళ్ల క్రితమే రెండో భార్య సంగీత తనని వదిలేసి వెళ్లిందని, ఆస్తి కోసం సంగీత తనపై నాలుగు కేసులు పెట్టిందని వెల్లడించారు. తనకు కూతురంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆడపిల్ల పుట్టిందని సంగీతను తాను విడిచిపెట్టలేదన్నారు. అన్ని విషయాలు తెలిసే జగదీశ్వరి తనని పెళ్లి చెసుకుందని చెప్పాడు. ఆడపిల్లను కన్నందుకు ఆమెను భర్త, అత్తామామలు జుట్టుపట్టుకొని నిర్ధాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేశారు. సభ్య సమాజం తల దించుకునే విధంగా చేసిన అత్తారింటి ఘాతుకం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Comments

comments